8జిబి ర్యామ్‌తో నోకియా 9, ధర గురించి తెలిస్తే..

Written By:

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ రానున్న నోకియా ఫోన్లపై రోజుకొక విషయాన్ని లీక్ చేస్తోంది. ఇప్పటిదాకా రానున్న ఫోన్ నోకియా 8 అని అందరూ ఊహించారు. అయితే రానున్నది నోకియా 9 అని లీకయిన రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.. ఇక ఈ ఫోన్‌లో ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.

అధ్బుతమైన 4జీ ఫోన్లు ( రూ. 5 వేల లోపు )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అతి త్వరలో

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది.

నోకియా 8ను ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో కాకుండా

ముందుగా అనుకున్నట్టు నోకియా 8ను ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో కాకుండా నోకియా 9 ఫోన్‌నే ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేయనుందని తెలిసింది. దీంతో నోకియా 9 స్మార్ట్‌ఫోనే హెచ్‌ఎండీ గ్లోబల్ నుంచి వస్తున్న మొదటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవుతుందని భావిస్తున్నారు

డిస్‌ప్లే

నోకియా 9 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు నెట్‌లో లీకైన సమాచారం ప్రకారం చూచాయగా తెలుస్తున్నాయి. వాటిని బట్టి చూస్తే ఈ ఫోన్‌లో 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ తో రానుంది.

ర్యామ్

4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి

కెమెరాలు

13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నట్టు తెలిసింది.

ధర

ఇక ఈ ఫోన్ ధర రూ.44వేల నుంచి రూ.55వేల మధ్యలో ఉంటుందని సమాచారం..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 9 Releasing Soon With Cutting-Edge Specs Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot