దిగ్గజాలను వణికిస్తున్న నోకియా 9 ఫీచర్లు, 41MPతో 4 కెమెరాలు, 8 జిబి ర్యామ్..
HMD గ్లోబల్ నోకియా బ్రాండ్లలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ దిగ్గజాలకు వణికిస్తోంది.
HMD గ్లోబల్ నోకియా బ్రాండ్లలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ దిగ్గజాలకు వణికిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండబ్ల్యూసీ 2018లో నోకియా 8(సిరోకో), నోకియా 7 ప్లస్, నోకియా 6 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించిన హెచ్‌ఎండీ గ్లోబల్, మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. నోకియా 9 పేరుతో కొత్తగా తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను ఈ కంపెనీ విడుదల చేస్తోందని తెలుస్తోంది. స్లాష్‌లీక్స్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని హై-ఎండ్ స్పెషిఫికేషన్లు బయటికి లీకయ్యాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని సోషల్ మీడియాలో లీకయిన రిపోర్టులన బట్టి తెలుస్తోంది.

ట్రిపుల్ కెమెరాతో..
Slashleaks ప్రకారం హైఎండ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు ఈ ఫోన్ రెడీ అవుతోందని ట్రిపుల్ కెమెరాతో ఇది మార్కెట్లోకి రానుందని ఇమేజ్ లతో పోస్ట్ చేసింది. కాగా ఇందులో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ పొందుపరిచనట్లుగా తెలుస్తోంది.

6.1 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే..
ఈ డివైజ్ 6.1 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండి, 18:9 aspect ratioని కలిగి ఉందని 5.5-inch footprintతో రానుందని తెలిపింది. ceramic blackలో గోల్డ్ ఫినిష్ లో ఈ ఫోన్ అతి త్వరలో మార్కెట్లో ఇతర ఫోన్లను సవాల్ చేయనుందని రిపోర్ట్ చేసింది.

8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్..
Snapdragon's latest 845 chipsetతో రానున్ననోకియా 9లో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుపరిచారని రిపోర్టులను బట్టి తెలుస్తోంది.

41 ఎంపీ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా
ఈ ఫోన్ వెనుక వైపు మూడు ఫ్రంట్ వైపు సెల్పీ కెమెరాలతో రూపొందుతుందని, 41 ఎంపీ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, 20 ఎంపీ సెకండరీ టెలిఫోటో లెన్స్, 9.7 ఎంపీ మోనోక్రోమ్ కెమెరాలతో మూడు కెమెరా సెన్సార్లతో ఇది మార్కెట్లోకి రాబోతోందని తెలుస్తోంది. ముందు వైపు 21ఎంపీ సెన్సార్‌తో ఇది రూపొందుతోందని సమాచారం.

3900 ఎంఏహెచ్ బ్యాటరీ..
3900 ఎంఏహెచ్ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, ఇన్-గ్లాస్ ఫింగర్‌ప్రింట్ రీడర్ దీనిలో ఉండబోతున్నాయట. ఫీచర్ల పరంగా టాప్ బ్రాండులకు పోటీగా హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్పెషిఫికేషన్లతో చాలా స్ట్రాంట్‌గా మార్కెట్‌లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

IP68 water resistant
దీంతో పాటు ఈ స్పీస్ షీట్ Nokia 9 IP68 water resistant in-glass fingerprint readerతో ఇది రానుందని సమాచారం. ఇదే విషయాన్ని లీకయిన రిపోర్టులు చెబుతున్నాయి.

ధర వివరాలపై ఎటువంటి సమాచారం..
ఆండ్రాయిడ్ One powered, Android 8.1.0తో నోకియా 9 రానుందని తెలుస్తోంది. కాగా నోకియా 9 స్మార్ట్ ఫోన్ హై ఎండ్ మార్కెట్లో ఓ సంచలనం సృష్టించబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా దీని ధర వివరాలపై ఎటువంటి సమాచారం లేదు. త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications