నోకియా 9 vs వన్‌ప్లస్ 5, ఈ ఏడాది పెద్ద పోటీ ఇదేనా..?

యాపిల్ ఐఫోన్ 8కు పోటీగా ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అవుతాయని భావిస్తోన్న నోకియా 9, వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు అనధికారిక స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : గూగుల్ పరిశోధనలు చావును జయించబోతున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ సిరామిక్ బిల్డ్‌తో పాటు ఆల్-గ్లాస్ డిజైన్‌తో మరింత ప్రీమియమ్ లుక్‌లో కనిపించే అవకాశముందని తెలుస్తోంది. నోకియా 9 డిజైనింగ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ 1440p OLED డిస్‌ప్లేలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొన్ని రూమర్స్ ప్రకారం వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌‌లో డ్యుయల్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

ప్రాసెసర్ ఇంకా ర్యామ్...

ప్రాసెసర్ ఇంకా ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 6జీబి ర్యామ్‌తో పాటు శక్తివంతమైన Snapdragon 835 ఆక్టా కోర్ ప్రాసెసర్‌లను కలిగి ఉండే అవకాశం. స్టోరేజ్ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి 64జీబి, 128జీబి స్టోరేజ్ వర్షన్‌లలో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయని తెలుస్తోంది. IP68 రేటింగ్‌తో వస్తోన్న ఈ డివైస్‌లు నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలవని తెలుస్తోంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందట. నోకియా 9 విషయానికి వచ్చేసరికి 22 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ కెమెరాతో పాటు 12 పిక్సల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 9 vs OnePlus 5: The clash between upcoming flagship smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot