8 కెమెరాల స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసా ?

హెచ్‌ఎండీ గ్లోబల్‌ అభిమానులకు పండుగ వాతావరణాన్ని అందించనుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండు నోకియా నుంచి త్వరలో రానున్న స్మార్ట్‌ఫోన్ అనేక సంచలనాలకు వేదిక కాబోతుందని తెలుస్తోంది.

|

హెచ్‌ఎండీ గ్లోబల్‌ అభిమానులకు పండుగ వాతావరణాన్ని అందించనుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండు నోకియా నుంచి త్వరలో రానున్న స్మార్ట్‌ఫోన్ అనేక సంచలనాలకు వేదిక కాబోతుందని తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి అతి త్వరలో 5 కెమెరాలతో నోకియా 9 స్మార్ట్‌ఫోన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆ మధ్య లీక్‌ అయ్యి వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలు పలు సోషల్‌మీడియాల్లో దర్శనమిచ్చాయి.

 

బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వాడేవారు ఈ విషయాలు తెలుసుకోండిబ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వాడేవారు ఈ విషయాలు తెలుసుకోండి

పెంటా-లెన్స్‌(ఐదు లెన్స్‌లు) కెమెరా

పెంటా-లెన్స్‌(ఐదు లెన్స్‌లు) కెమెరా

లీకయిన ఫోటోల ప్రకారం ఈ ఫోన్‌కు అతిపెద్ద బ్యాటరీతో పాటు వెనుకవైపు పెంటా-లెన్స్‌(ఐదు లెన్స్‌లు) కెమెరా సెటప్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

నోకియా పవర్‌యూజర్‌ వెబ్‌సైట్‌లోనూ..

నోకియా పవర్‌యూజర్‌ వెబ్‌సైట్‌లోనూ..

చైనాకు చెందిన ఓ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ఫొటోలు కన్పించాయి. నోకియా పవర్‌యూజర్‌ వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫొటోలు ఉన్నాయి.

4,150ఎంఏహెచ్‌ బ్యాటరీ

4,150ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఈ ఫోన్‌లో 4,150ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఫొటోల్లో ఫోన్‌ నీలం రంగులో ఉంది. ఈ నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ ఫోన్‌ను..
 

ఇప్పటికే ఈ ఫోన్‌ను..

నిజానికైతే ఇప్పటికే ఈ ఫోన్‌ను విడుదల చేయాల్సి ఉండగా.. పెంటా లెన్స్ కెమెరా వల్లే ఆలస్యమైందట.

ముందువైపు మూడు కెమెరాలు..

ముందువైపు మూడు కెమెరాలు..

ఇక ఈ ఫోన్‌లో ముందువైపు మూడు కెమెరాలుండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమైతే నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలున్నట్లు అవుతుందని తెలుస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే..

ఫీచర్ల విషయానికొస్తే..

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. నోకియా 9 ఆండ్రాయిడ్‌ పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 6.01 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం.

కంపెనీ నుంచి అధికారికంగా..

కంపెనీ నుంచి అధికారికంగా..

అయితే వీటిపై కంపెనీ నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. మరి ఈ విషయాలపై స్పష్టత రావాలంటే ఫోన్‌ విడుదలయ్యేదాకా ఎదురుచూడాల్సిందే.

Best Mobiles in India

English summary
Nokia 9 with five rear cameras revealed in leaked picture more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X