నోకియా 9 ఇండియా ధర లీకైంది..?

హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలోని నోకియా ఇటీవల మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నోకియా 3, నోకియా 5, నోకియా 6 మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లు జూన్ నాటికి భారత్ సహా అన్ని ప్రముఖ మార్కెట్లోకి రాబోతోన్నాయి. మరో నాలుగు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు హెచ్‌ఎండి గ్లోబల్ ప్రకటించింది.

Read More : డ్యుయల్ కెమెరా ఫోన్‌ల గురించి 7 ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 9 గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

వీటిలో ఒకటైన నోకియా 9 మోడల్‌కు సంబంధించి ఆసక్తికర సమచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎల్‌జీ జీ6, హెచ్‌టీసీ యూ అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పోటీగా భావిస్తోన్న నోకియా 9, జూలై లేదా ఆగష్టులో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Snapdragon 835 చిప్‌సెట్‌తో రాబోతోన్న ఈ ఫోన్ ధర భారత్‌లో రూ.44,999 వరకు ఉండొచ్చని నోకియా పవర్‌యూజర్ చెబుతోంది.

మౌస్ వాడటంలో 10 మెళుకువలు

నోకియా 9 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

5.5 అంగుళాల క్యూహైడెఫిపిషన్ OLED స్ర్ర్కీన్ ,ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 6జీబి ర్యామ్, అడ్రినో 540 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

పోటాపోటీగా 4G Volte ఫోన్‌లు రిలీజ్, రూ.4000లోపే

నోకియా 9 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

22 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా. 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, , 3800mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 టెక్నాలజీ. ఐరిస్ స్కానర్, ఐపీ68 సర్టిఫికేషన్.

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయి, ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

మరో రూమర్ ప్రకారం,

నోకియా 9 స్మార్ట్ ఫోన్ విప్లవాత్మక Nokia OZO ఆడియో టెక్నాలజీతో రాబోతోందట. ఈ టెక్నాలజీ 3డీ ఆడియో ఎక్స్ పీరియన్స్ తో పాటు స్పాటియల్ ఆడియో ప్లేబ్యాక్ వ్యవస్థను సృష్టించగలదట. వీఆర్ అనుభూతులతో పాటు హై-క్వాలిటీ స్టీరియో ప్లేబ్యాక్‌ను OZO ఆడియో ప్లే బ్యాక్ సపోర్ట్ ద్వారా పొందవచ్చట.

ఇండియాలో Redmi ఫోన్‌లకు తిరుగులేదు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 9 With Snapdragon 835 to Cost Rs 44,999 in India: Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot