నోకియా, మైక్రోసాప్ట్ జతలో 'ఏస్' విడుదల..

Posted By: Staff

నోకియా, మైక్రోసాప్ట్ జతలో 'ఏస్' విడుదల..

నోకియా మొబైల్ కంపెనీ, సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ఇటీవల జత కట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరి భాగస్వామ్యంతో మార్కెట్లోకి కొత్త కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది. వీరిద్దరి భాగస్వామ్యం మార్కెట్లో ఉన్న మొబైల్ తయారీదారులకు వణుకు పుట్టించే విషయమే. 2012 ప్రధమార్దంలో వీరిద్దరి భాగస్వామ్యంలో విడుదలవనున్న విండోస్ నోకియా మొబైల్ ఫోన్ పేరు 'నోకియా ఏస్'.

నోకియా ఏస్ విండోస్ ఫోన్ మార్కెట్లోకి కొత్త బూస్టింగ్ టెక్నాలజీస్‌తో రానుంది. నోకియా విండోస్ మొబైల్ గురించి అధికారకంగా ప్రకటించక పోయినప్పటికీ దీనిని కొన్న టెక్నాలజీ బ్లాగులు మాత్రం 2012లో నోకియా విడుదల చేయనున్నట్లు రాశాయి. నోకియా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజాదరణ కలిగిన మొబైల్ తయారీదారు. అలాంటి నోకియా మొట్టమొదటి సారి విండోస్ ఫోన్‌ని విడుదల చేస్తుందంటే అది యావత్ ప్రపంచానికే ఓ పెద్ద పండుగగా అభివర్ణించవచ్చు.

ఇక నోకియా విండోస్ ఫోన్ 'నోకియా ఏస్' ఫీచర్స్‌ని గనుక పరిశీలించినట్లేతే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని యొక్క స్క్రీన్ సైజు 4.3 ఇంచ్‌గా రూపొందించడమే కాకుండా దీని యొక్క స్క్రీన్ బ్లాక్ AMOLED టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండడం విశేషం. ఇక కెమెరా విషయానికి వస్తే 8 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. కెమెరాతో పాటుకార్ల్ జీజ్ లెన్స్, ఆటో ఫోకస్ ఫీచర్స్‌ ప్రత్యేకం. నోకియా ఏస్ మొబైల్ హై డెఫినేషన్ మొబైల్ వీడియో రికార్డింగ్‌, ప్లేబ్యాక్‌ని సపోర్ట్ చేస్తుంది.

ఇక నోకియా ఏస్ మొబైల్‌ విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.4 GHz CPU ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 16జిబి మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మల్టీ ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. ఎఫ్‌మ్ రేడియో అదనపు ఆకర్షణ.

ఇక నోకియా మొబైల్ బ్యాటరీ బ్యాక్ అప్ విషయం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇందులో 1800 mAh స్టాండర్డ్ బ్యాటరీని ఇవ్వడం జరిగింది. నోకియా ఏస్ మొబైల్ పోన్ మార్కెట్లోకి 4జీ కనెక్టివిటీ ఫీచర్‌తో రావడం యాజర్స్‌కు లాభించే విషయం.

నోకియా ఏస్ మొబైల్ ప్రత్యేకతలు:

* ప్రాసెసర్: 1.4GHz single-core
* ఆపరేటింగ్ సిస్టమ్: Microsoft Windows Phone 7.5
* కనెక్టివిటీ: HSPA+/LTE
* డిస్ ప్లే: 4.3-inch AMOLED Clear Black Display
* స్టోరేజి మొమొరీ: 16GB internal
* కెమెరా ఫీచర్స్: 8MP AF with Carl-Zeiss optics
* బ్యాటరీ: 1,800mAh

ఇన్ని అత్యాధునిక పీచర్స్ ఉన్న నోకియా ఏస్ మొబైల్ ఫోన్ ధరని ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్ట లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot