22 మెగా పిక్సల్ కెమెరాతో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్?

మొబైల్ ఫోన్ ప్రపంచంలో ఒకప్పటి సంచలనం నోకియా మరోసారి మెరవబోతోంది. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఈ టెక్నాలజీ దిగ్గజానికి గత కొన్ని సంవత్సరాలుగా ఏమి కలసిరావటం లేదు.

 22 మెగా పిక్సల్ కెమెరాతో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్?

మార్కెట్లో సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన పోటీ, మైక్రోసాఫ్ట్‌‍తో భాగస్వామ్యం అంతగా కలిసి రాకపోవటం వంటి అంశాలు నోకియాను తీవ్రంగా దెబ్బతీసాయి. మైక్రోసాఫ్ట్‌తో నోకియా ఒప్పందం ఈ ఏడాది మూడవ క్వార్టర్‌తో ముగియనున్న నేపథ్యంలో స్వతహాగా ఫోన్‌లను మార్కెట్ చేసుకునేందుకు నోకియా సిద్ధమవుతోంది.

Read More : రింగింగ్ బెల్స్ నుంచి రూ.251 ఫోన్, రూ.9,900 టీవీ (వచ్చేసాయ్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్ఎండీ గ్లోబల్‌తో 10 సంవత్సరాల ఎగ్రిమెంట్‌

టీవల నోకియా హెచ్ఎండీ గ్లోబల్‌తో 10 సంవత్సరాల ఎగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. నోకియా బ్రాండ్ పేరుతో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు విశ్వవ్యాప్తంగా విక్రయించుకునేందుకు హెచ్ఎండీ గ్లోబల్‌కు నోకియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

రూమర్ మిల్స్ చెబుతోన్న వివరాల ప్రకారం

రూమర్ మిల్స్ చెబుతోన్న వివరాల ప్రకారం నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, నోకియా పీ1గా మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఫోన్ లను ఇన్ ఫోకస్, షార్ప్ ఇంజినీర్లు సంయుక్తంగా అభివృద్థి చేసినట్లు సమాచారం.

ఆక్వోస్ పీ1కు రీబ్రాండెడ్ వర్షన్‌

నోకియా ఫో1 పోన్‌ను షార్ప్ ఆక్వోస్ పీ1కు రీబ్రాండెడ్ వర్షన్‌గా రూమర్ మిల్స్ అభివర్ణిస్తున్నాయి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

 5.3 అంగుళాల పూర్తి హైడెఫినిన్ 1080 పిక్సల్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 22.6 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఐపీ58 సర్టిఫికేషన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Is Nokia Back with an Android Smartphone? Renders of Alleged Nokia P1 Leak Online. Read More in Telugu Gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot