పక్కా ప్లాన్‌తో దూసుకొస్తున్న నోకియా ఫోన్స్?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో అనేక ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఫీచర్ ఫోన్‌ల విభాగంలో రారాజుగా వెలుగొందిన నోకియా తొలత సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్‌లను రూపొందించి ఆ తరువాత విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు అడాప్ట్ అయ్యింది.

Read More : హానర్ నుంచి అదిరిపోయే ఫోన్‌లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విస్తృతమైన పోటీ మార్కెట్

విస్తృతమైన పోటీ ఫోన్ మార్కెట్ నోకియాను నష్టాల ఊబిలోకి నెట్టటంతో నోకియా తన మొబైల్ ఫోన్ డివిజన్‌ను మైక్రోసాఫ్ట్‌కు అమ్మాల్సి వచ్చింది.

ఒప్పందం ముగియటంతో..

మైక్రోసాఫ్ట్‌తో కదుర్చకున్న ఒప్పందంలో భాగంగా 2015 చివరి వరకు నోకియా తన సొంత బ్రాండింగ్ పై మొబైల్ ఫోన్‌లను విక్రయించకూడదు. ఆ గడవు కాస్తా ముగియటంతో నోకియా నుంచి రాబోతున్న స్మార్ట్ ఫోన్ ల పై ఒక్కసారికి ఉత్కంఠ వాతావరణం నెలకుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా చైనా తెలిపిన వివరాల ప్రకారం..

నోకియా చైనా జాయింట్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ మైక్ వాంగ్ ఆగష్టులో వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా నుంచి ఈ ఏడాది చివరి నాటికి 3 నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి.

రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్, మరొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌

నోకియా నుంచి రాబోతోన్న కొత్త ఫోన్‌లలో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ మరొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ అని పలు కధనాలు చెబుతున్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HMD Global..

నోకియా అప్‌కమింగ్ ఫోన్స్ అలానే టాబ్లెట్ పీసీలను ఫిన్‌ల్యాండ్‌కు చెందిన HMD Global అభివృద్థి చేస్తుండగా, Foxconn కంపెనీ తయారు చేయబోతోంది.

హై-ఎండ్ స్పెసిఫికేషన్స్..

2K ఓఎల్ఈడి స్ర్కీన్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్స్ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్లో కనెక్ట్ అవ్వాలంటే

ప్రస్తుత పోటీ మార్కెట్లో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ కనెక్ట్ అవ్వాలంటే బస్ట్ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్ ఎంతో అవసరం. HMD Global మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకుని నోకియా ఫోన్‌లను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

Nokia D1Cకు సంబంధించి

అప్‌కమింగ్ నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌ Nokia D1Cకు సంబంధించి పముఖ బెంచ్ మార్కింగ్ సైట్ GeekBench కొత్త సమచారాన్ని రివీల్ చేసింది. Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కావటం విశేషం

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్నాప్‌డ్రాగన్ 430 SoC

Nokia D1C స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు GeekBench లిస్టింగ్స్ చెబుతున్నాయి. స్నాప్‌డ్రాగన్ 430 SoCతో వచ్చే ఫోన్ ఖచ్చితంగా ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది.

Nokia P1 పేరుతో మరో ఫోన్

తాజాగా మరో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌కు సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. కొత్త రిపోర్ట్స్ ప్రకారం Nokia P1 పేరుతో ఓ మెటల్ బాడీ ఫోన్ రూపుదిద్దుకుంటోందట. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. Nokia P1 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 5.2 అంగుళాల డిస్‌ప్లేతో, రెండవ వేరియంట్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా Z లాంచర్

క్యూహైడెఫినిషన్ (2560 x 1440పిక్సల్స్) అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థతో వస్తోన్నఈ ఫోన్స్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన నోకియా Z లాంచర్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయట.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

graphene కెమెరా సెన్సార్‌

శక్తివంతమైన కెమెరాలతో వస్తోన్న ఈ ఫోన్‌లలో graphene కెమెరా సెన్సార్‌లను వాడినట్లు సదరు రిపోర్ట్ చెబుతోంది. ఈ సెన్సార్‌లో లైట్ కండీషన్స్ లోనూ హైక్వాలిటీ ఫోటగ్రఫీని చేరువచేస్తాయి. ఐపీ68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న నోకియా పీ1 ఫోన్ నీటీ ప్రమాదాలను సైతం సమర్థవంతంగా ఎదర్కోగలదట. డస్ట్ రెసిస్టెంట్ కూడా.

శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 లేదా స్నాప్‌డ్రాగన్ 821 SoCలను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసి ఉండొచ్చని ఆ రిపోర్ట్ పేర్కొంది. 4జీబి ర్యామ్‌ను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Android Phones May Just Be Worth the Wait!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot