2013లో 'నోకియా' చరిత్ర సృష్టిస్తుంది..!!

Posted By: Staff

2013లో 'నోకియా' చరిత్ర సృష్టిస్తుంది..!!

2012 మద్యలో నోకియా ప్రభంజనం సృష్టించడానికి సిద్దమైంది. ఏంటా ప్రభంజనం అని అనుకుంటున్నారా.. నోకియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైఖెల్ హెల్బర్ చెప్పిన ఇన్పర్మేషన్ ప్రకారం 2012 మద్యలో 'నోకియా అపోలో విండోస్ ఫోన్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల నోకియా లండన్‌లో నిర్వహించిన 'నోకియా వరల్డ్ కాన్పరెన్స్'లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నోకియా, మైక్రోసాప్ట్ భాగస్వామ్యంతో ఇటీవలే విండోస్ మ్యాంగ్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ గురించి తెలియజేయడం జరిగింది.

మొబైల్ ఫోన్ పరిశ్రమలో మైక్రోసాప్ట్, నోకియా ఓ సరిక్రొత్త అద్యయనానికి నాంది పలికనున్నాయి. అందులో భాగంగానే విండోస్ 7.5 మ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. ఈ అపోలో విండోస్ మొబైల్స్ ద్వారా నోకియా తిరిగి తన పూర్వవైభవాన్ని సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో మీరు గనుక చూసినట్లైతే మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్, ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆధారిత మొబైల్ ఫోన్స్ ఎక్కవగా దర్శనమిస్తున్నాయని అన్నారు.

ఇక యాపిల్ కంపెనీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ iOS5తో మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నోకియా కూడా కస్టమర్స్ కోసం అద్బుతమైన మొబైల్స్‌ని ప్రవేశపెట్టేందుకు గాను ఈ నోకియా అపోలో విండోస్ ఫోన్స్‌ని ప్రవేశపెడుతుంది. దీంతో ఆండ్రాయిడ్, ఐస్‌క్రీమ్ శాండ్ విచ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గట్టి పోటీని ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని ఆయన తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot