మార్కెట్లోకి ‘నోకియా ఆషా 205’

Posted By: Super

మార్కెట్లోకి ‘నోకియా ఆషా 205’

 

విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా, నవంబర్‌లో ఆవిష్కరించిన డ్యూయల్ సిమ్ వేరియంట్ ‘ఆషా 205’ను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.3,499. ఈ క్వర్టీ కీప్యాడ్ ఫోన్ ప్రత్యేక ఫేస్‌బుక్ బటన్‌ను కలిగి ఉంటుంది. దీంతో యూజర్ నేరుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కావచ్చు.  ఆషా 205 సింగిల్ సిమ్ వర్షన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్పెసిఫికేషన్‌లు:

2.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,

వీజీఏ రేర్ కెమెరా,

10ఎంబి ఉచిత యూజర్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

జీపీఆర్ఎస్/ఎడ్జ్,

బ్లూటూత్ వీ2.1 విత్ ఈడీఆర్,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

1020ఎమ్ఏహెచ్ బీఎల్-5సీ బ్యాటరీ (11 గంటల టాక్‌టైమ్,  608 గంటల స్టాండ్‌బై),

40 ఉచిత గేమింగ్ అప్లికేషన్స్, నోకియా స్టోర్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈ-బడ్డీ మెసెంజర్,

ప్రత్యేక ఫేస్‌బుక్ బుటన్,

ధర రూ.3,499.

యూత్ మెచ్చిన లూమియా 620 వచ్చే జనవరిలో!

యూత్‌ను టార్గెట్ చేస్తూ నోకియా డిజైన్ చేసిన విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ లూమియా 620 దేశీయ మార్కెట్లో జనవరి నుంచి లభ్యంకానుంది. ధర రూ.12,450. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన కెమెరా స్సెసిఫికేషన్‌లు క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. లూమియా 620 కీలక ఫీచర్లు…… విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కెమెరా (5 మెగా పిక్సల్ రేర్, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా), స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్, మ్యాపింగ్ అప్లికేషన్స్ (నోకియా మ్యాప్స్, నోకియా డ్రైవ్, నోకియా ట్రాన్స్‌పోర్ట్, నోకియా సిటీ‌లెన్స్), నోకియా మ్యూజిక్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, లైవ్ టైల్స్, ఎక్స్‌బాక్స్ లైవ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, 7జీబి ఆన్‌లైన్ స్కై డ్రైవ్ స్టోరేజ్, ఇంటర్నెట్ ఎక్ప్‌ప్లోరర్ 10.

ఈ అందాలకు బడాబాబులు ఫిదా? (గ్యాలరీ)

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot