మార్కెట్లోకి నోకియా ఆషా 230

Posted By:

ఆషా 230 పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ బడ్జెట్ ఫోన్‌ను నోకియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.3,449. నోకియా ఆన్‌లైన్ స్టోర్ ఈ డివైస్‌‍ను విక్రయిస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా నోకియా ఈ ఫీచర్ హ్యాండ్‌సెట్‌ను రెండు వేరియంట్‌‍లలో ప్రకటించటం జరిగింది. ప్రస్తుతం డ్యుయల్ సిమ్ వేరియంట్‌ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. సింగిల్ సిమ్ వేరియంట్ అందుబాటుకు సంబంధించిన వివరాలను నోకియా తన వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

 మార్కెట్లోకి నోకియా ఆషా 230

పరిమాణం99.5x58.6x 13.2మిల్లీ మీటర్లు, బరువు 89 గ్రాములు, నోకియా ఆషా ప్లాట్‌ఫామ్, ఫాస్ట్ లేన్ యూజర్ ఇంటర్‌ఫేస్, వాట్స్ యాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, లైన్, వుయ్‌చాట్ వంటి అప్లికేషన్‌లను ఫోన్‌‍లో ముందుగానే లోడ్ చేసారు. 2.8 అంగుళాల QVGA తెర (రిసల్యూషన్240x 320పిక్సల్స్), 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వార ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత, 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్ టైమ్, 21 రోజుల స్టాండ్‌బై సామర్థ్యంతో).

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.... మల్టీ మీడియా ఫైల్స్‌ను షేర్ చేసుకునేందుకు బ్లూటూత్ ఇంకా మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, ఇంటర్నెట్ నిమిత్తం జీపీఆర్ఎస్ వ్యవస్థను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఈ ఫీచర్ ఫోన్ 3జీ కనెక్టువిటీని సపోర్ట్ చేయదు. నోకియా ఆషా 230 డ్యుయల్ సిమ్ ఫోన్‌ను 6 కలర్ వేరియంట్‌లలో సొంతం చేసుకోవచ్చు వాటి వివరాలను పరిశీలించినట్లయితే....బ్రైట్ రెడ్, బ్రైట్ గ్రీన్, బ్లాకా, సియాన్, వైట్ ఇంకా ఎల్లో (పసుపు).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot