సామ్‌సంగ్ గొప్పా.. నోకియా గొప్పా..?

By Super
|
Nokia Asha 305 vs Samsung Galaxy Y Duos: Which One Should You Buy?

యూఎస్, యూకేలతో పోలిస్తే భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల విప్లవం ఇంకా ఆరంభ దశలోనే ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. అయితే పరిశ్రమ అంతరంగికులు మాత్రం రానున్న సంవత్సరాల్లో ఈ పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశముందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై తాజాగా ఐడీసీ విడుదల చేసిన ఓ నివేదిక ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతానికి 2.9శాతంగా ఉన్న భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2016 నాటికి 9.3శాతానికి పెరిగే అవకాశముందని ఐడీసీ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ విశ్లేషణలను పరిగణలోకి తీసుకున్న మార్కెట్ లీడర్లు అన్ని వర్గాల ప్రజలకు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండేవిధంగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఐడీసీ నిబంధనలను నిశితంగా పరిశీలించిన సామ్‌సంగ్, నోకియాలు మధ్య తరగతి మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. ‘నోకియా ఆషా 305’(ధర రూ.4,580), ‘సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యూయోస్’(ధర రూ.8,799) మోడళ్లలో విడుదలైన ఈ గ్యాడ్జెట్‌లలో ఏది మన్నికైనది..?, మీ ఓటు ఎవరికి..?

డిజైనింగ్:

నోకియా ఆషా 305 98గ్రాముల బరువును కలిగి 110.3 x 53.8 x 12.8 మిల్లీమీటర్ల చుట్టు కొలతను నమోదు చేయగా, 109 గ్రాముల బరువు కలిగిన గెలాక్సీ వై డ్యూయోస్ 109.8 x 60 x 12 మిల్టీ మీటర్ల చుట్టుకొలతను కలిగి ఉంది.

డిస్‌‌ప్లే:

ఆషా 305, 3 అంగుళాల టీఎఫ్‌టీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 400పిక్సల్స్) ను కలిగి ఉంటుంది. మరో వైపు గెలాక్సీ వై డ్యూయోస్ 3.14 అంగుళాల టీఎఫ్‌టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్)ను కలిగి ఉంది.

ఆపరేటింగ్ సిస్టం:

నోకియా ఆషా 305 సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. గెలాక్సీ వై డ్యూయోస్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ

ప్లాట్‌ఫామ్‌ను ఆండ్రాయిడ్ ఐసీఎస్ లేదా జెల్లీ‌బీన్‌కు అప్‌డేట్ చేసే అవకాశముంది.

మెమరీ:

ఈ రెండు ఫోన్‌లలోని మెమెరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబికి పెంచుకోవచ్చు. కాగా, ఆషా 305 ఇంటర్నల్ మెమెరీ 126 ఎంబీ, గెలాక్సీ వై డ్యూయోస్ ఇంటర్నల్ మెమరీ 160 ఎంబీ.

కెమెరా:

ఆషా 305, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరాను కలిగి ఉంది. దీని రిసల్యూషన్ సామర్ధ్యం 1600 x 1200పిక్సల్స్. ఈ కెమెరా సాయంతో 176 x 144పిక్సల్ సామర్ద్యం గల వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

గెలాక్సీ వై డ్యూయోస్ 3.15 మెగా పిక్సల్ రేర్ కెమెరాను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 2048 x 1536పిక్సల్స్. ఈ కెమెగా జియో ట్యాగింగ్ ఫీచర్‌ను కలిగి ఉండటంతో వీడియోలను QVGA క్వాలిటీలో రికార్డ్ చేసుకోవచ్చు.

కనెక్టువిటీ:

ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు జీపీఆర్ఎస్, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. నోకియా ఆషా 305 బ్లూటూత్ 2.1 వర్షన్ విత్ ఈడీఆర్ ను సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ వై డ్యూయోస్ HSDPA (7.2ఎంబీపీఎస్), బ్లూటూత్ 3.0 విత్ ఏ2డీపీ, వైఫీ 802.11 b/g/n, వైఫీ హాట్ స్పాట్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ బ్యాకప్:

ఆషా 305లో అమర్చిన 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ 14 గంటల టాక్‌టైమ్, 528 గంటల స్టాండ్‌బై టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. గెలాక్సీ వై డ్యూయోస్‌లో నిక్షిప్తం చేసిన 1300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ 9 గంటల టాక్‌టైమ్, 360 స్టాండ్‌బై టైమ్‌ను ఆఫర్ చేస్తుంది.

తీర్పు:

గెలాక్సీ వై డ్యూయోస్ డీసెంట్ స్పెసిఫికేషన్‌లతో కూడిన మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కాగా నోకియా ఆషా 305 అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో కూడిన తక్కువ ధర హ్యాండ్‌సెట్. ధర పరంగా ఆలోచించే వారికి నోకియా ఆషా 305 ఉత్తమ ఎంపిక.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X