డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ వార్ (నోకియాxసామ్‌సంగ్)

Posted By: Staff

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ వార్ (నోకియాxసామ్‌సంగ్)

 

 

భారతీయులు డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను అమితంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో సామ్‌సంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్, కార్బన్ తదితర మొబైల్ తయారీ కంపెనీలు వివిధ శ్రేణుల్లో డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయ బ్రాండ్‌లైన నోకియా, సామ్‌సంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు గత కొంత కాలంగా సాగుతోంది. నోకియా ఆషా సిరీస్ నుంచి తాజాగా విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ‘ఆషా 308’ ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి రూ.5685కే లభ్యమవుతుంది. మరోవైపు సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి ‘వై డ్యుయోస్ లైట్’ పేరుతో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌‌ఫోన్‌ను ఇప్పటికే ఆవిష్కరించింది. వీటి స్పెసిఫికేషన్‌ల మధ్య తులనాత్మక అంచనా.....

బరువు ఇంకా చుట్టుకొలత:

ఆషా 308: 109.9 x 54.0 x 13.0మిల్లీమీటర్లు, బరువు 104 గ్రాములు,

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 103.5 x 58 x 12మిల్లీమీటర్లు, బరవు 103 గ్రాములు,

డిస్‌ప్లే:

ఆషా 308: 3 అంగుళాల కెపాసిటివ్ మల్లీ-పాయింట్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్),

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

ప్రాసెసర్:

ఆషా 308: 800మెగాహెడ్జ్ ప్రాసెసర్,

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 832మెగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

ఆషా 308: నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం(ప్రత్యేకతలు: ఇంటర్నెట్ బ్రౌజర్, మీడియా అప్లికేషన్స్, ఇమేజ్ వ్యూవర్, కెమెరా, మ్యూజిక్ ప్లేయర్, వాయిస్ రికార్డర్, ఎఫ్ఎమ్ రేడియో, క్యాలెండర్, టాస్క్స్, కాంటాక్ట్ అప్లికేషన్స్, హై క్వాలిటీ కలర్ స్ర్కీన్స్, సెన్సిటివ్ ఐకాన్స్),

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఆషా 308: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

మెమరీ:

ఆషా 308: 20ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 2జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఆషా 308: బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ 2.0,

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై, 3జీ, బ్లూటూత్,

బ్యాటరీ:

ఆషా 308: 1110ఎమ్ఏహెచ్ బీఎల్-4యు బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 510గంటల స్టాండ్‌బై),

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: 1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర:

ఆషా 308: రూ.5685,

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: రూ.6,790,

అదనపు ఫీచర్లు:

ఆషా 308: ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్, నోకియా నియర్ బై, నోకియా లైఫ్+, నోకియా మ్యాప్స్, 40 ప్రీమియమ్ ఈఏ గేమ్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, నోకియా మెసేజింగ్ సర్వీస్, వీడియో స్ట్రీమింగ్,

గెలాక్సీ వై డ్యుయోస్ లైట్: సామ్‌సంగ్ చాట్ ఆన్, గూగుల్ సెర్చ్, గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ లాటిట్యూడ్, గూగుల్ టాక్, గూగుల్ మెయిల్, గూగుల్ +, యూట్యూబ్, సామ్‌సంగ్ అప్లికేషన్స్, సోషల్ హబ్, మెసెంజర్, ఇన్స్‌స్టెంట్ మేసేజింగ్, సామ్‌సంగ్ కైస్ కనెక్టువిటీ,

తీర్పు:

పెద్దదైన డిస్‌ప్లే, ఉత్తమ బ్రౌజింగ్ ఇంకా తక్కువ ధరను కోరుకునే వారికి ఆషా 308 ఉత్తమ ఎంపిక. ఆడ్వాన్స్ కనెక్టువిటీ ఫీచర్లతో పాటు మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఆస్వాదించాలనుకునే వారికి గెలాక్సీ వై డ్యూయోస్ లైట్ బెస్ట్ ఆప్షన్.

స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ను goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్:

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot