నోకియా ఆషా 308 vs సోనీ ఎక్స్‌పీరియా టైపో (మార్కెట్ హాట్ టాపిక్)

By Super
|
Nokia Asha 308 vs Sony Xperia Tipo: Dual-SIM Newbies Market Release Collision


డ్యూయల్ సిమ్ ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌లు విభాగంలో చైనా బ్రాండ్‌ల ఆధిపత్యం కొనసాగుతున్న నేపధ్యంలో ప్రముఖ బ్రాండ్‌లైన నోకియా, సోనీలు ఉపయుక్తమైన ఫీచర్లతో కూడిన రెండు సరికొత్త ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌లను సమంజసమైన ధరల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నోకియా రూపొందించిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ‘నోకియా ఆషా 308’కాగా సోనీ రూపొందించిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ పేరు ‘ఎక్ప్ పీరియా టైపో డ్యూయల్’. ధరలు విషయానికొస్తే ఆషా 308ను నోకియా రూ.5,300కు ఆఫర్ చేస్తోంది. ప్రీఆర్డర్ పై లభ్యమవుతున్న ఎక్ప్‌పీరియా టైపోను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ రూ.10,299కు అందిస్తోంది. ఈ ఎంట్రీస్ధాయి స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ క్లుప్తంగా..........

బరువు ఇంకా చుట్టుకొలత:

ఆషా 308: బరువు 104 గ్రాములు, శరీర కొలత 109.9 x 54.0 x 13.0మిల్లీమీటర్లు,

టైపో డ్యూయల్: అంచనా బరువు 99.4గ్రాములు, శరీర కొలత 103 x 57 x 13మిల్లీమీటర్లు,

డిస్‌ప్లే:

ఆషా 308: 3 అంగుళాల కెపాసిటివ్ మల్టీ పాయింట్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్), స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్,

టైపో డ్యూయల్: 3.2 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), గ్లాస్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్,

ప్రాసెసర్:

ఆషా 308: 800మెగాహెర్జ్ ప్రాసెసర్,

టైపో డ్యూయల్: 800మెగాహెర్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

ఆషా 308: నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,

టైపో డ్యూయల్: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఆషా 308: 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా,

టైపో డ్యూయల్: 3.15 మెగా పిక్సల్ కెమెరా (జియో ట్యాగింగ్ ఫీచర్),

రెండు ఫోన్‌లలో ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

మెమరీ:

ఆషా 308: 20ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, 64ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

టైపో డ్యూయల్: 2జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఆషా 308: బ్లూటూత్3.0, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

టైపో డ్యూయల్: బ్లూటూత్ 2.1 విత్ ఏ2డీపీ, 3జీ విత్ 7.2ఎంబీపీఎస్ హెచ్ఎస్‌డీపీఏ, 5.76ఎంబీపీఎస్ హెచ్‌యూపీఏ, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:

ఆషా 308: 1,110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (6గంటల టాక్‌టైమ్, 510 గంటల స్టాండ్‌బై),

టైపో డ్యూయల్: 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 360 గంటల స్టాండ్‌బై),

తీర్పు:

ఈ రెండు

స్మార్ట్‌ఫోన్‌లు ఎంట్రీస్ధాయిని కలిగి ఉన్పప్పటికి ఉత్తమ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి. అయితే ఎక్ప్‌పీరియా టైపో‌లో ఒదిగి ఉన్న అనేక ఫీచర్లు ఆషా308లో లోపించాయి. ఎక్ప్‌పీరియా టైపోలో లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం సింపుల్ ఇంకా స్మూత్ మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి నోకియా ఆషా 308 ఉత్తమ ఎంపిక. క్వాలిటీ స్మార్ట్‌ఫోన్ అనుభూతులను కోరుకునే వారికి సోనీ ఎక్ప్‌పీరియా టైపో డ్యూయల్ బెస్ట్ చాయిస్.

Read in English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X