‘ఆషా 310’ ఆవిష్కరణ... 5 ప్రత్యేకతలు

Posted By:

 ‘ఆషా 310’ ఆవిష్కరణ... 5 ప్రత్యేకతలు
విశ్వసనీయ మొబైల్ బ్రాండ్ నోకియా దేశీయ మార్కెట్లో ఆషా సిరీస్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల పై దృష్టిసారించింది. తాజాగా ఈ సిరీస్ నుంచి ‘ఆషా 301' మోడల్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ వై-ఫై సపోర్ట్ హ్యాండ్‌సెట్‌ను నోకియా ఆవిష్కరించింది. హ్యాండ్‌సెట్ ధర రూ.5,500. పాకెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఇంటర్నెట్ కనెక్టువిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి నోకియా ఆషా 301 స్పెసిఫికేషన్‌లు. ఆషా 310 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వర్షన్‌లలో లభ్యమవుతోంది. ఇతర వివరాలు...

బరువు ఇంకా చుట్టుకొలత: ఫోన్ బురువు 103.7 గ్రాములు, చుట్టుకొలత 109.9 x 54 x 13మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే: 3 అంగుళాల డబ్ల్యూక్యూవీజీఏ స్ర్కాచ్ ప్రూఫ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్,

ఆపరేటింగ్ సిస్టం: సింబియన్ ఎస్40,

మెమెరీ: 128ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్ విత్ ఏ2డీపీ సపోర్ట్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: 1,110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (టాక్‌టైమ్ 17 గంటలు, 25 రోజుల స్టాండ్‌బై).

ఐదు ప్రత్యేక అంశాలు....

నోకియా ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్: హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేసిన ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్ అప్లికేషన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
నోకియా నియర్‌బై అప్లికేషన్: ఈ వెబ్ అప్లికేషన్ సాయంతో సమీప ప్రాంతాలను కనుగొనవచ్చు.
40 ఈఏ గేమ్స్: ఈ హ్యాండ్‌సెట్ యూజర్, 40 ఉచిత ఈఏ గేమ్‌లను నోకియా స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ధర ఇతర అందుబాటు వివరాలు: ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న నోకియా ఆషా 310 ధర రూ.5,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot