నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

|

అబుదబీ వేదికగా జరుగుతోన్న నోకియా వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన ఆషా సిరీస్ నుంచి మూడు వేరియంట్‌లలో సరికొత్త హ్యాండ్‌సెట్‌లను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నోకియా సీఈఓ స్టీఫెన్ ఇలోప్ ఆషా 500, ఆషా 502, ఆషా 503 హ్యాండ్‌సెట్‌లను పరిచయం చేసారు. ఈ మూడు ఫోన్‌లు సరికొత్త డిజైనింగ్‌తో రూపుదిద్దుకున్నాయి. ఈ కొత్త డిజైన్‌ను డ్యూయల్ షాట్ లేయరింగ్ ఎఫెక్ట్‌గా నోకియా అభివర్ణిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా ఆషా 502 ఇంకా 503 హ్యాండ్‌సెట్‌లు పటిష్టమైన 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటాయి. మరో హ్యాండ్‌సెట్ ఆషా 500 2 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌లుత్వరలోనే బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఈ మూడు హ్యాండ్‌సెట్‌లలో నోకియా 503 అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 5మెగా పిక్సల్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, స్వైప్ వంటి ప్రత్యేక ఫీచర్లను నోకియా పొందుపరిచింది.అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్‌‌ల ధరలను పరిశీలించినట్లయితే నోకియా 500 ఫోన్ ధర 69డాలర్లు, నోకియా 502 ఫోన్ ధర 89 డాలర్ల, నోకియా 503 ఫోన్ ధర 99 డాలర్లు.

 నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

నోకియా ఆషా 500:

సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్,
2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
64ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

నోకియా ఆషా 502:

డ్యూయల్ సిమ్,
3 అంగుళాల స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
64ఎంబి ర్యామ్,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ వై-ఫై,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1010ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు
 
నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

నోకియా ఆషా 503:

సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్,
3 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.
3జీ, వై-ఫై, బ్లూటూత్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌లు

అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్‌‌ల ధరలను పరిశీలించినట్లయితే నోకియా 500 ఫోన్ ధర 69డాలర్లు, నోకియా 502 ఫోన్ ధర 89 డాలర్ల, నోకియా 503 ఫోన్ ధర 99 డాలర్లు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X