నోకియా ఆషా 500

Posted By:

నోకియా ఆషా 500

ఫిన్నిష్ మొబైల్ తయారీ దిగ్గజం నోకియా అబుదాబీ వేదికగా గడిచిన అక్టోబర్‌లో నిర్విహించిన నోకియా వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా తన ఆషా సిరీస్ నుంచి ఆషా 500, ఆషా 502, ఆషా 503 వేరియంట్‌లలో సరికొత్త హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించటం జరిగింది. నోకియా ఆషా 502 మోడల్ ఇప్పటికే మార్కెట్ల్ లభ్యమవుతోంది. నోకియా లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా ఆషా 500 ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఇన్ఫీబీమ్ ఆషా 500 స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,649కి ఆఫర్ చేస్తోంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
2.8 అంగుళాల QVGA కెపాసిటివ్ మల్టీపాయింట్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 320 x 240పిక్సల్స్),
ఎల్‌సీడీ ట్రాన్స్‌ఫ్లెక్టివ్ డిస్‌ప్లే టెక్నాలజీ, 142పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ వర్షన్ 1.1.1,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (4ఎక్స్ డిజిటల్ జూమ్),
వై-ఫై, యూఎస్బీ, బ్లూటూత్, జీపీఎర్ఎస్, 2జీ కనెక్టువిటీ,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
1200ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (14 గంటల టాక్‌టైమ్, 22 రోజుల స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot