ఇండియన్ మార్కెట్లోకి ‘నోకియా ఆషా 501’ (సరికొత్త ఫీచర్లతో)

Posted By:

విశ్వసనీయ బ్రాండ్ నోకియా తన ఆషా సిరీస్ నుంచి ‘ఆషా 501' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నోకియా సంస్థల సీఈఓ స్టీఫెన్ ఇలోప్ (Stephen Elop) హాజరయ్యారు. సరికొత్త ఆషా ఫ్లాట్‌ఫామ్‌తో ఈ డివైజ్‌ను వృద్ధిచేయటం జరిగింది.

ఇండియన్ మార్కెట్లో ఆషా 501 విక్రయాలు జూన్ నెల నుంచి ప్రారంభమవుతాయి. ధర రూ.5,000. ఫోన్ స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3 అంగుళాల QVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320x240పిక్సల్స్), 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3.2 మెగా పిక్సల్ కెమెరా, వై-ఫై, 2జీ కనెక్టువిటీ సపోర్ట్, బ్లూటూత్ 3.0, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 48 రోజుల స్టాండ్‌బై టైమ్). నోకియా ఆషా 501 తెలుగు సహా 12 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ మార్కెట్లోకి నోకియా ఆషా 501

నోకియా ఆషా 501... వైట్, రెడ్, బ్లాక్, ఎల్లో, బ్లూ ఇంకా గ్రీన్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

ఇండియన్ మార్కెట్లోకి నోకియా ఆషా 501

నోకియా ఆషా 501లో ఏర్పాటు చేసిన సరికొత్త ఫాస్ట్‌లేన్ ఫీచర్ సౌకర్యవంతమైన మల్టీటాస్కింగ్‌కు దోహదపడుతుంది.

ఇండియన్ మార్కెట్లోకి నోకియా ఆషా 501

నోకియ ఆషా 501 రెడ్ కలర్ వేరయింట్ ముందు భాగం,

ఇండియన్ మార్కెట్లోకి నోకియా ఆషా 501

నోకియ ఆషా 501 రెడ్ కలర్ వేరయింట్ వెనుక భాగం,

ఇండియన్ మార్కెట్లోకి నోకియా ఆషా 501

నోకియ ఆషా 501 ఎల్లో కలర్ వేరయింట్ ముందు భాగం,

ఇండియన్ మార్కెట్లోకి నోకియా ఆషా 501

నోకియ ఆషా 501 ఎల్లో కలర్ వేరయింట్ వెనుక భాగం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot