ఆన్‌లైన్ మార్కెట్లోకి నోకియా ఆషా 502
ఫీచర్ ఫోన్‌లకు.. ఆధునిక వర్షన్ స్మార్ట్ ఫోన్ లకు మధ్య దూరాన్ని తొలగించే క్రమంలో ప్రముఖ మొబైల్ తయారీ నోకియా ఇటీవల ఆవిష్కరించిన డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ ‘ఆషా 502' ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.5,739.

నోకియా ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ అయిన నోకియా ఆన్‌లైన్ స్టోర్ ఇంకా ఇన్ఫీబీమ్ డాట్ కామ్‌లు ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆషా 502 డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను ముందుగా అక్టోబర్‌లో నిర్వహించిన 2013 నోకియా వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించటం జరిగింది.
ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:
3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), డ్యూయల్ షాట్ లేయరింగ్ ఎఫెక్ట్, క్రిస్టల్ ఎఫెక్ట్ కేసింగ్, 32 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోసిమ్ కార్డ్‌స్లాట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (14 గంటల టాక్‌టైమ్ సామర్ధ్యంతో).
లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: రెడ్, సియాన్, బ్లాక్, గ్రీన్, ఎల్లో, వైట్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








