నోకియా ఆషా 503 వచ్చేసింది

Posted By:

భారత్‌లోని, మధ్య ముగింపు మొబైల్ ఫోన్ మార్కెట్ పై దృష్టి సారించిన నోకియా తన ఆషా సిరీస్ నుంచి ‘ఆషా 503' పేరుతో మరో డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ఫోన్ ధర అంచనా రూ.6,799. జనవరి 2014 నుంచి ఈ ఫోన్‌లు మార్కెట్లో లభ్యం కానున్నాయి.

నోకియా ఆషా 503 వచ్చేసింది

ఆషా 503 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 133 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ 1.2, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), డ్యూయల్ సిమ్, కనెక్టువిటీ ఫీచర్లు (మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ), లియోన్ 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (2జీ నెట్‌వర్క్ పై 12 గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 4.5 గంటల  టాక్‌టైమ్.

ఫీచర్ ఫోన్‌లకు.. ఆధునిక వర్షన్ స్మార్ట్ ఫోన్ లకు మధ్య దూరాన్ని తొలగించే క్రమంలో ప్రముఖ మొబైల్ తయారీ నోకియా ఇటీవల ఆవిష్కరించిన డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ ‘ఆషా 502' ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.5,739.

ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:

3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), డ్యూయల్ షాట్ లేయరింగ్ ఎఫెక్ట్, క్రిస్టల్ ఎఫెక్ట్ కేసింగ్, 32 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోసిమ్ కార్డ్‌స్లాట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (14 గంటల టాక్‌టైమ్ సామర్ధ్యంతో). లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: రెడ్, సియాన్, బ్లాక్, గ్రీన్, ఎల్లో, వైట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot