మార్కెట్లోకి నోకియా ఆషా 503..3జీ సపోర్ట్ ఫీచర్‌తో

Posted By:

ఇటీవల కాలంలో తన ఆషా సిరీస్ నుంచి వివిధ మోడల్స్‌లో ఫీచర్ ఫోన్‌లను విడుదల చేస్తున్న నోకియా తాజాగా, 3జీ సపోర్ట్ సౌలభ్యతతో కూడిన ఆషా 503  హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,683.

మార్కెట్లోకి నోకియా ఆషా 503..3జీ సపోర్ట్ ఫీచర్‌తో

నోకియా తన ఆషా 500, ఆషా 502, ఆషా 503 ఫీచర్ ఫోన్‌లను అక్టోబర్, 2013లో నిర్వహించిన ‘నోకియా వరల్డ్ ఈవెంట్'లో ఆవిష్కరించటం జరిగింది. వీటిలో మొదటి రెండు మోడల్స్ అయిన ఆషా 500, ఆషా 502లు ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆషా 500 ధర రూ.4,339 కాగా ఆషా 502 ధర రూ.5,739.  బ్లాక్, వైట్, ఎల్లో ఇంకా రెడ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఆషా 503 హ్యాండ్‌సెట్‌ను నోకియా అధికారిక వెబ్‌సైట్ nokia.indiatimes.com రూ.6,683కు ఆఫర్ చేస్తోంది. ఆషా 503 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.......

డ్యుయల్ సిమ్, 3 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, నోకియా ఆషా 1.2 ఆపరేటింగ్ సిస్టం, 128ఎంబిఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 64ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు..3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 3.0, స్లామ్ ఫీచర్, ఎఫ్ఎమ్ రేడియో,1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్‌టైమ్, 480 గంటల స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot