ఆశలు రేకెత్తించనున్న 'నోకియా ఆశా సిరిస్ మొబైల్స్'

Posted By: Super

ఆశలు రేకెత్తించనున్న 'నోకియా ఆశా సిరిస్ మొబైల్స్'

నోకియా మొబైల్స్ భారతీయుల భరోసా మొబైల్ ఫోన్ కంపెనీ. అందుకే కాబోలు ఇండియాలోని మద్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నోకియా కొత్తగా నాలుగు మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ నాలుగు మొబైల్ ఫోన్స్ సిరిస్‌కి నోకియా 'ఆశా సిరిస్' అంటూ పేరుని పెట్టింది. చూడగానే యూజర్స్ ప్రేమలో పడే విధంగా నోకియా ఈ ఆశా సిరిస్ మొబైల్ ఫోన్స్‌ని రూపొందించడం జరిగింది.

నోకియా విడుదల చేయనున్న ఆ నాలుగు ఫోన్లు:

*నోకియా ఆశా 200
*నోకియా ఆశా 201
*నోకియా ఆశా 300
*నోకియా ఆశా 303

నోకియా ఆశా 200, నోకియా ఆశా 201 రెండు మొబైల్స్ ఒకే విధమైన ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ, రెండింటికీ మద్య ఉన్నతేడా నోకియా ఆశా 200 డ్యూయల్ సిమ్ ఫీచర్ ని కలిగి ఉండగా, నోకియా ఆశా 201 సింగిల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా క్వర్టీ కీప్యాడ్‌తో పాటు మంచి కలర్ పుల్ స్క్రీన్‌ని కలిగి ఉన్నాయి. ఎఫ్ ఎమ్ రేడియో, మల్టీ మీడియా ఫీచర్స్‌తో పాటు, 2మెగా ఫిక్సల్ కెమెరా వీటి సొంతం.

క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉండి చూడగానే యూజర్స్‌ని ఇట్టే ప్రేమలో పడేసి మొబైల్స్ నోకియా ఆశా 300, నోకియా ఆశా 303. 2.6 ఇంచ్ స్క్రీన్ సైజుతో పాటుగా టచ్ ఫెసిలిటీని కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై ఫీచర్స్‌లను సపోర్ట్ చేస్తాయి. ఇందులో 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక నోకియా ఆశా 300 మొబైల్‌లో మాత్రం 5 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌లుగా రూపొందించబడింది. బ్లాటూత్, వై-పై లను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఈ నాలుగు మొబైల్స్‌తో పాటు నోకియా కొత్తగా మార్కెట్లోకి నోకియా లుమియా 710, నోకియా లుమియా 800 మొబైల్స్‌ని కూడా విడుదల చేసింది.

నోకియా లుమియా 710 మొబైల్ ప్రత్యేకతలు:

* 1.4GHz Qualcomm MSM8255 processor
* Adreno 205 GPU
* 512MB of RAM
* 3.7” WVGA 480

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot