నోకియా ఫోన్ల ప్రియులకు శుభవార్త: కొత్త ఫోన్లలో పాత ఫీచర్స్

|

నోకియా ఫోన్‌లలో అందరు ఎంతో ఇష్టపడే ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫీచర్‌ను ఇప్పుడు కొత్త ఫోన్‌లలో తిరిగి తెస్తున్నట్లు కనిపిస్తోంది. HMD గ్లోబల్ సంస్థ తరచూ అనేక క్లాసిక్ నోకియా ఫోన్‌లను తయారుచేస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా TA-1212 అనే మోడల్ మరొకదాన్ని విడుదల చేసే పనిలో ఉన్నది.

బార్-మోడల్ ఫీచర్ ఫోన్
 

TENAA విడుదల చేసిన పోస్టర్లో బార్-మోడల్ ఫీచర్ ఫోన్ ఎరుపు రంగుతో వస్తుంది. ఇది పాత నోకియా 5130 ను వెంటనే మీకు గుర్తు చేస్తుంది. కానీ ఈ కొత్త ఫోన్లలో సైడ్-మౌంటెడ్ మ్యూజిక్ కంట్రోల్ బటన్లు మాత్రం కనిపించవు.

ISRO NAVIC నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ తో రియల్‌మి X50 ప్రో

నోకియా ఫీచర్ ఫోన్‌

నోకియా ఫీచర్ ఫోన్‌

ఈ కొత్త ఫోన్ నోకియా 110 వంటి ప్రాథమిక ఫీచర్ ఫోన్‌గా ఉంది. ఇది ఫ్లిప్ లేదా టఫ్ వంటి కైయోస్-శక్తితో పనిచేసే పరికరాల వలె కాకుండా ఇది 0.36GHz సింగిల్-కోర్ ప్రాసెసర్, 8MB RAM మరియు 16MB స్టోరేజ్ (మెగాబైట్లు) తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్‌ స్లాట్ ను కలిగి ఉంటుంది. ఇది అదనంగా 32GB వరకు మెమొరీని విస్తరించడానికి మద్దతు ఇవ్వగలదు కాబట్టి మీరు ఈ ఫోన్‌ను సాధారణ MP3 ప్లేయర్‌గా ఉపయోగించవచ్చు.

Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌

మొబైల్ ఫీచర్స్

మొబైల్ ఫీచర్స్

ఫీచర్ ఫోన్‌లోని డిస్ప్లే 240x320px రిజల్యూషన్‌తో 2.4-అంగుళాల పరిమాణంలో వస్తుంది. అలాగే ఇది 1,200 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 13.1mm మందంను కలిగి ఉండి 88 గ్రాముల బరువుతో వస్తుంది. ఫోటోల కోసం దీని యొక్క వెనుక భాగంలో 0.3MP ఒక కెమెరా ఉంది. ఈ ఫోన్ లో వీడియో మద్దతు లేదు కానీ LED ఫ్లాష్ ఉంది.

ఎక్స్‌ప్రెస్-ఆన్
 

ఎక్స్‌ప్రెస్-ఆన్

HMD 2018 లో ఎక్స్‌ప్రెస్-ఆన్ ట్రేడ్‌మార్క్‌ను పునరుద్ధరించింది. అయితే ఈ ఫోన్‌లో యూజర్‌ మార్చగల ప్యానెల్లు ఉన్నాయో లేదో ఇంకా చెప్పలేదు. ఈ ఫోన్ ఎప్పుడు ఆవిష్కరించబడుతుందనే దాని గురించి కూడా సమాచారం లేదు. అలాగే ఈ ఫోన్ 2G కనెక్టివిటీతో మాత్రమే వస్తుంది. ఇది ఇకపై కొన్ని క్యారియర్‌లలో పనిచేయదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia bringing back XpressMusic Feature Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X