Nokia C1 Plus స్మార్ట్‌ఫోన్‌ లీకైన స్పెసిఫికేషన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూడండి!!

|

ఇండియాలో మొబైల్ రంగంలో ఒకప్పుడు రారాజుగా ఎదిగిన నోకియా సంస్థ తరువాత కాలంలో విడుదల అయిన స్మార్ట్‌ఫోన్‌లకు కొద్ది కాలం పోటీని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మళ్ళి తన యొక్క సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నది. దాదాపు ఏడాది క్రితం హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా C1 అనే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ సంస్థ దీనికి అప్ డేట్ వెర్షన్ గా త్వరలో నోకియా C1 ప్లస్ అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నోకియా C1 ప్లస్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఖచ్చితంగా తెలియదు కాని ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. వీటి గురించి మాకు తెలిసిన వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నోకియా C1 ప్లస్ ప్రాసెసర్‌ చిప్‌సెట్  వివరాలు

నోకియా C1 ప్లస్ ప్రాసెసర్‌ చిప్‌సెట్ వివరాలు

నోకియా పవర్ యూజర్స్ నుండి వచ్చిన నివేదికల ఆధారంగా నోకియా C1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ 5.45-అంగుళాల స్క్రీన్ డిస్ప్లేను హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో 149.1 మిమీ x 71.2 మిమీ x 8.75mm కొలతల పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ (గో ఎడిషన్) ప్రాసెసర్‌ యొక్క 1.4GHz వద్ద క్లాక్ చేసిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఉపయోగించే అసలు చిప్‌సెట్ యొక్క వివరాలు నోకియా సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది 1GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్నట్లు సమాచారం. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరిని 64GB వరకు విస్తరించవచ్చు.

 

Also Read: Google Pay, PhonePe వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్....Also Read: Google Pay, PhonePe వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్....

నోకియా C1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ ఫీచర్స్

నోకియా C1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ ఫీచర్స్

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లను కొనే వారు అందులో గమనించే మొదటి విషయం కెమెరా కెపాసిటీ. ఈ ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే నోకియా C1 ప్లస్ ఫోన్ సింగిల్ 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను వెనుక భాగంలో కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది. నోకియా C1 ప్లస్ 4G కనెక్టివిటీతో వస్తుందని మరో లీక్ వెల్లడించింది. రోజంతా యూజర్ల కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఉండడానికి 2,500 mAh సామర్థ్యం గల బ్యాటరీతో ప్యాక్ చేయబడి రానున్నట్లు సమాచారం. చివరగా నోకియా C1 ప్లస్ ఫోన్ కొత్త ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌కు బదులుగా ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌ను అమలు చేయడానికి ఈ ఫోన్‌కు 1 జీబీ ర్యామ్ సరిపోదని కారణం స్పష్టంగా ఉంది.

నోకియా C1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ వివరాలు

నోకియా C1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ వివరాలు

నోకియా C1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. అయితే నోకియా సి 1 ప్లస్ ఫోన్ అధికారికంగా రెడ్ మరియు బ్లూ కలర్ ఎంపికలలో లభిస్తుంది. గతంలో నోకియా సి 1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ టిఎ -1312 ను కలిగి ఉన్న యురేషియన్ ఎకనామిక్ కమిషన్ (EEC) నుండి ధృవీకరణ పొందినట్లు పుకార్లు వచ్చాయి. ఇది సమీప భవిష్యత్తులో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సూచిస్తుంది.

Best Mobiles in India

English summary
Nokia C1 Plus Upcoming Phone Specifications Leaked: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X