నోకియా నుంచి మరో సంచలన ఫోన్..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నోకియా ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా నోకియా అభిమానల్లో ఆశలు చిగురించాయి. 2017 ఆరంభంలో మార్కెట్లోకి రాబోతున్న నోకియా ఫోన్‌లకు సంబంధించి ఇప్పటికే ఇంటర్నెట్లో అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

నోకియా నుంచి మరో సంచలన ఫోన్..?

Read More : స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.14,000 వరకు తగ్గింపు

తాజాగా నోకియా కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌కు సంబంధించిన ఓ వీడియో చైనా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొన్ని ప్రముఖ వెబ్‌సైట్‌లు మాత్రం, ఈ వీడియోలో పొందుపరిచిన ఫోటోలను నోకియా అప్‌కమింగ్ సీ1 ఫోన్‌కు చెందినవిగా అభివర్ణిస్తున్నాయి. స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ ఫోన్‌కు సంబంధించి స్పెసిపికేషన్స్‌ కూడా రివీల్ అవటం విశేషం. డ్యయల్ కెమెరా సెటప్, ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌‌కు ప్రధాన ఆకర్షణటా నిలిచాయి.

నోకియా నుంచి మరో సంచలన ఫోన్..?

Read More: క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్స్ పై 10 స్మార్ట్‌‍ఫోన్‌లు

స్నాప్‌డ్రాగన్ 830 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ వచ్చేసరికి (32జీబి, 64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ సెన్సార్ కాంభినేషన్‌లో డ్యుయల్ కెమెరా సెటప్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటి అంశాలు ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయ. ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. వీడియో రెండర్ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఫోన్ 3210 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై రన్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా పవర్ యూజర్ వెల్లడించిన వివరాల ప్రకారం..

2017 ఆరంభంలో మార్కెట్లోకి రాబోతున్న నోకియా ఫోన్‌లకు సంబంధించి ఇప్పటికే ఇంటర్నెట్లో అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నోకియా పవర్ యూజర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నోకియా డీ1సీ పేరుతో రాబోతున్న మొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

మొదటి వేరియంట్

5 ఇంచ్ హైడెఫినిషన్ 1080 డిస్‌ప్లే, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి ప్రధానమైన ఫీచర్లు కలిగి ఉంటంది. ఈ ఫోన్ ధర 150 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.10,000).

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండవ వేరియంట్..

5.5 ఇంచ్ హైడెఫినిషన్ 1080 డిస్‌ప్లే, 3జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి ప్రధానమైన ఫీచర్లు కలిగి ఉంటంది. ఈ ఫోన్ ధర 150 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.15,000).

ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

నోకియా డీ1సీ ఫోన్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్(క్లాక్ వేగం 1.4గిగాహెర్ట్జ్), అడ్రినో 505 జీపీయూ, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం

హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా..

ఇటు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా నోకియా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. రూ.30,000 రేంజ్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లు క్వాడ్ హైడెఫినిషన్ రిసల్యూషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 820 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 22.6 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 4జీ ఎల్టీఈ, ఆండ్రాయిడ్ నౌగట్ ఆవుట్-ఆఫ్-ద-బాక్స్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Nokia C1 Video Renders Reveal Stunning Design, Dual Camera Setup, and Xenon Flash.Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting