భార‌త మార్కెట్లో Nokia C21 Plus బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుద‌ల.. ధ‌ర ఎంతంటే!

|

ప్ర‌ముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ Nokia నుంచి మ‌రో స‌రికొత్త మొబైల్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Nokia C21 Plus స్మార్ట్‌ఫోన్‌ను మంగ‌ళ‌వారం భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ మొబైల్ 13 మెగా పిక్సెల్ క్వాలిటీ గ‌ల ప్రైమ‌రీ కెమెరా ఫీచ‌ర్‌ను క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. అంతేకాకుండా ఇది ఒక‌సారి బ్యాట‌రీ ఫుల్ ఛార్జ్ చేస్తే 3 రోజుల బ్యాక‌ప్ ఇస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఇవే కాకుండా ఈ మొబైల్ ఇంకా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఇది అఫ‌ర్డ‌బుల్ ధ‌ర‌లో కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు, ధ‌ర ఇత‌ర విశేషాల‌ను గురించి తెలుసుకుందాం.

 
భార‌త మార్కెట్లో Nokia C21 Plus బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుద‌ల.. ధ‌ర

Nokia C21 Plus ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో ప‌ని చేస్తుంది. octa-core Unisoc SC9863A SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. దీనికి రెండేళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్ పై కంపెనీ హామీ ఇచ్చింది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 13 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 13 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో డెప్త్ సెన్సార్ లెన్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,050mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 10 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వ‌ర్శ‌న్ 4.2 క‌లిగి ఉంది.

భార‌త మార్కెట్లో దీని ధ‌ర‌:
భార‌త్‌లో మార్కెట్లో ఈ మొబైల్‌ 3GB RAM + 32GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.10,299 గా నిర్ణ‌యించారు. మ‌రో వేరియంట్ 4GB RAM + 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ధ‌ర రూ.11,299 గా నిర్ణ‌యించారు. నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి వినియోగ‌దారుల‌కు కొనుగోళ్లు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌క్లూజివ్ లాంచ్ కింద ఈ మొబైల్‌తో పాటు వైర్డ్ హెడ్ బ‌డ్స్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. అన్ని ఈ కామ‌ర్స్ సైట్ల‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉండ‌నుంది. ఇది ముదురు నీలం, గ్రే క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంది.

భార‌త మార్కెట్లో Nokia C21 Plus బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుద‌ల.. ధ‌ర

ఇప్ప‌టికే భార‌త్‌లో అందుబాటులో ఉన్న Nokia G21 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో ప‌ని చేస్తుంది. octa-core Unisoc T606 (12 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో సెన్సార్ లెన్స్‌, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో డెప్త్ సెన్సార్ లెన్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,050mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. అమెజాన్‌లో Nokia G21 మోడ‌ల్ 4జీబీ ర్యామ్‌+ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.12,999 గా అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Nokia C21 Plus With 13-Megapixel Dual Cameras

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X