చేతికి ఉంగరాలే కాదు.. ఫోన్ కూడా బంగారపుదే వాడోచ్చు..

Posted By: Super

చేతికి ఉంగరాలే కాదు.. ఫోన్ కూడా బంగారపుదే వాడోచ్చు..

నోకియా ఇండియాలో నెంబర్ వన్ మొబైల్ తయారీదారు అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త కొత్త మోడల్స్‌ని విడుదల చేసి తన వైవిధ్యాన్ని కస్టమర్స్‌కు అందజేస్తుంది. ఇందులో భాగంగా నోకియా మార్కెట్లోకి కొత్త మొబైల్ హ్యాండ్ సెట్ మోడల్‌ని విడుదల చేస్తుంది. ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే హై ఎండ్ మొబైల్స్ అంటే ఎవరికైతే ఇష్టం లేకుండా లగ్జరీ మొబైల్‌ని చేతిలో ఉంచుకొవాలనుకుంటారో వారికి ఇది బాగా సూట్ అవుతుంది. నోకియా త్వరలో విడుదల చేయనున్న ఈ మొబైల్ పేరు నోకియా సి3-01. కేవలం కాల్స్ మాత్రమే ఉపయోగిస్తూ చేతిలో లగ్జరీ మొబైల్స్ ఉండేందుకు ఇష్టపడే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది బాగా నచ్చుతుందని తెలిపారు. ఇంకా ఈ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే మొబైల్ మొత్తం బంగారపు పూతతో ఉండడమే.

ఇంకా చెప్పాలంటే కటింగ్ ఎడ్జి టెక్నాలజీతో మంచి పవర్ పుల్ ఆపరేటింగ్ సిస్టమ్ దీని సొంతం. మొబైల్‌లో ప్రత్యేకంగా చెప్పుకునే అంశం ఏమిటంటే చూడడానికి చాలా చక్కగా, అందంగా ఉంటుంది. మొబైల్‌కి 18 క్యారెట్ల గోల్డ్ పెయింటింగ్‌తో పాటుగా మ్యాచింగ్ ధీమ్స్‌ని మొబైల్‌లో రూపోందించడం జరిగింది. గతంలో నోకియా సరిగ్గా ఇలాంటి మొబైల్‌నే మార్కెట్లోకి విడుదల చేస్తే కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ పోందింది. ఇప్పుడు విడుదల చేయనున్న నోకియా సి3-01లో హై ఫెర్పామెన్స్ ఫీచర్స్ ఉండడంతో గతంలో విడుదల చేసిన మొబైల్ కంటే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని బావిస్తున్నారు.

ఇక నోకియా సి3-01 ఫీచర్స్ విషయానికి వస్తే 1GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి, 2.4 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ రిజల్యూషన్‌తో 256 కలర్‌ని సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 140ఎమ్‌బి లభిస్తుండగా, 64 MB RAMని కలిగి ఉంది. ఇక డేటా స్టోరేజి విషయానికి వస్తే ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు మొమొరీని విస్తరించుకునే వెసులుబాటు ఉంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పై లను కూడా సపోర్ట్ చేస్తుంది. 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం. మొబైల్ ముందు భాగంలో ఉన్న విజిఎ కెమెరా వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న బంగారపు మొబైల్ ధర ఇండియాలో సుమారుగా రూ 16,620గా ఉండవచ్చునని నిపుణుల అభిప్రాయం.

నోకియా సి3-01 గోల్డ్ ఎడిషన్ మొబైల్ ఫీచర్స్:

* 2.4 inch touchscreen display
* 240 x 320 pixels resolution
* 1 GHz processor
* Series 40 6th edition OS
* Full keypad
* Dedicated camera and volume keys
* WLAN 802.11 b,g,n
* 3G Connectivity
* 5 megapixel camera with LED flash
* Up to 4x digital xoom
* Video capture in QVGA at up to 30 fps
* VGA at up to 15 fps
* Media Player with metadata ID3 tags
* Ovi Music support
* Stereo FM radio with RDS
* 30 MB internal memory
* MicroSD memory card slot
* 32 GB expandable memory
* Stereo Bluetooth 2.1 with EDR
* High-Speed USB 2.0
* Up to 20 hours music playback time
* Up to 405 hours of standby time
* Up to 5 hours 30 mins of talk time
* 1050 mAh Li-ion battery

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot