'నోకియా మొబైల్‌లో షాంఫైన్' చిందించండిలా...

Posted By: Super

'నోకియా మొబైల్‌లో షాంఫైన్' చిందించండిలా...

 

నోకియా మైక్రోసాప్ట్‌తో చేతులు కలిపిన తర్వాత ఎంత త్వరగా అంటే అంత త్వరగా మొబైల్ మార్కెట్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ఆరాటపడుతున్న మొబైల్ కంపెనీ. మార్కెట్లోకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి రెండు స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసి కొన్ని రోజులు గడవక ముందే మరో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనున్నామని ప్రకటిచండమే కారణం.

ఇటీవలే నోకియా వరల్డ్ మీటింగ్ జరిగిన సందర్బంలో నోకియా విండోస్ ఆధారిత మొబైల్ ఫోన్స్ నోకియా లుమియా 710, నోకియా లుమియా 800ని ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. విండోస్ పోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వర్సన్ విండోస్ ఫోన్ ట్యాంగో‌తో రన్ అయ్యేటటువంటి మరో కొత్త స్మార్ట్ ఫోన్ 'నోకియా షాంపైన్'ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు నోకియా తెలిపింది.

నోకియా షాంపైన్ మొబైల్ విండోస్ ఫోన్ 7 కొత్త వర్సన్ 7.10.8711తో రన్ అవుతుంది. మైక్రోసాప్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కి పెట్టిన పేరు విండొస్ ఫోన్ ట్యాంగో. నోకియా మాత్రం అధికారకంగా నోకియా షాంపైన్ మొబైల్ గురించిన సమాచారం మాత్రం వెల్లడించ లేదు. ఇదంతా కేవలం ఇంటర్నెట్లో లీకైన సమాచారం మాత్రమేనని పాఠకులు గ్రహించాల్సిందిగా మనవి.

నోకియా షాంపైన్ ఫీచర్స్ విషయానికి వస్తే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను యూజర్స్ తీయవచ్చు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 16 జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై - పై లను కూడా నోకియా షాంపైన్ సపోర్ట్ చేయనుంది. పాఠకులకు నోకియా షాంపైన్ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం అతి త్వరలో అందజేయడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot