నోకియా సంచలన ప్రకటన

నోకియా బ్రాండ్ రిఎంట్రీకి రంగం సిద్ధమైంది. 2017లో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మనం చూడబోతున్నాం.

|

ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోకియా అభిమానులకు ఇది పండుగలాంటి వార్త. 2017లో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు నోకియా అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 15న జరిగిన నోకియా క్యాపిటల్ మార్కెట్స్ డే 2016లో నోకియా ఈ వివరాలను వెల్లడించినట్లు ఫోన్ అరీనా ఓ కధనంలో పేర్కొంది. ఈ ఫోన్‌లను ఫాక్స్‌కాన్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : షాకింగ్.. రూ.2000 నోటును స్కాన్ చేస్తే?

D1C పేరుతో ..

D1C పేరుతో ..

D1C పేరుతో నోకియా లాంచ్ చేయబోతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో అనేక రూమర్స్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసందే. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన మొదటి లుక్ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weiboలో హల్‌చల్ చేస్తుంది.

బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో

బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో

నోకియా D1C స్మార్ట్‌ఫోన్ బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో రాబోతున్నట్లు తెులస్తోంది. మెటల్ ఫ్రేమ్ అలానే పాలీ కార్బోనేట్ కలర్ బ్యాక్ ప్యానల్స్‌తో ఈ ఫోన్ కనువిందు చేయనుంది.

GFXBench లిస్టింగ్స్ ప్రకారం..

GFXBench లిస్టింగ్స్ ప్రకారం..

కొద్ది రోజుల క్రితం నోకియా D1C డివైస్‌ను 13.8 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన టాబ్లెట్‌గా అభివర్ణిస్తూ GFXBench పలు వివరాలు విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వెలువడిన తరువాత నోకియా D1C స్మార్ట్‌ఫోన్ కాదని, టాబ్లెట్ మాత్రమేనని అనుకున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Nokiapoweruser సైట్ ప్రకారం...

Nokiapoweruser సైట్ ప్రకారం...

Nokiapoweruser అనే వెబ్‌సైట్ నోకియా డీ1సీ, 4.8 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్ అని క్లారిటీ ఇవ్వటంతో పలు ఊహాగానాలకు తెరపడింది.

రూమర్ 1

రూమర్ 1

Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్.

రూమర్ స్పెసిఫికేషన్స్

రూమర్ స్పెసిఫికేషన్స్

Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కావటం విశేషం. 1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 SoCను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే చిప్‌సెట్‌ను రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లలో వినియోగించారు.

3జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు సమాచారం...

3జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు సమాచారం...

Nokia D1C స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు GeekBench అలానే AnTuTu లిస్టింగ్స్ చెబుతున్నాయి.

16 మెగా పిక్సల్ కెమెరా...

16 మెగా పిక్సల్ కెమెరా...

స్టోరేజ్ విషయానికి వచ్చేసిరికి ఈ డివైస్ లో 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంలో 16 మెగా పిక్సల్, ఫోన్ ముందుగ భాగంలో 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమచారం. Nokia D1C స్మార్ట్ ఫోన్ లో 4జీ ఎల్టీఈ వంటి ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లతో పాటుగా బ్లుటూత్, జీపీఎస్, వై-ఫై, యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్, పిడోమీటర్ వంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయ్!

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Nokia confirms its return to smartphone market in 2017. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X