జనవరి మొదటి వారంలో లూమియా ఫోన్‌లు

Posted By: Prashanth

జనవరి మొదటి వారంలో లూమియా ఫోన్‌లు

 

లూమియా 620, 820, 920 స్మార్ట్‌ఫోన్‌ల విడుదల‌కు సంబంధించి నోకియా అధికారిక ప్రకటనను వెలువరించింది. ఈ మూడు మోడళ్లలోని స్మార్ట్‌ఫోన్‌లను జనవరి నుంచి యూకే రిటైల్ అవుట్ లెట్ అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఈ మోడళ్లు ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి విశ్వసనీయంగా అందిన వివరాలు మేరకు.. లూమియా 920, 820 మోడళ్లు జనవరి తొలి వారం నుంచి దేశీయ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంది. మరో మోడల్ లూమియా 620ను జనవరి ఆఖరి వారం నుంచి విక్రయించే అవకాశముంది.

2012 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్!

లూమియా 920 స్సెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే,

8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్యూర్ వ్యూ బ్రాండింగ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్

స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

లూమియా 820 స్సెసిఫికేషన్‌లు:

4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్యాక్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్,

1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

8జీబి ఇంటర్నల్ మెమరీ (ప్యూర్ వ్యూ టెక్నాలజీ),

వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),

1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్-10 ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లు

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot