ఈ సారి జియో ఫోన్‌కి షాక్ ఇచ్చేది నోకియా ఫోనేనా..?

Written By:

జియోఫోన్ రాకతో మార్కెట్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. అన్ని కంపెనీలు అత్యంత తక్కువ ధరలకే 4జీ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. ఇప్పటికే ఈ ఎయిర్‌టెల్, మైక్రోమ్యాక్స్‌, బిఎస్ఎన్ఎల్, ఐడియా లాంటి కంపెనీలు ప్రస్తుతం బరిలో ఉన్నాయి. వీటి సరసన ఇప్పుడు నోకియా కూడా చేరింది.

శాంసంగ్ ఎస్‌8, నోట్‌8లలో కొత్త ఎడిషన్‌, పేలిన ఫోన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలో నోకియా 4జీ ఫీచర్ ఫోన్లు..

త్వరలో నోకియా కూడా 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేయనుంది. ఆ సంస్థకు మాతృసంస్థ అయిన హెచ్‌ఎండీ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహతా ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నోకియా

గ్రామాలతోపాటు, పట్టణాలు, నగరాల్లోనూ జియో 4జీ ఫోన్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంద‌ని, దీనికి అనుగుణంగా మేము కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.

అతి తక్కువ ధరకే

త్వరలోనే తాము కూడా అతి తక్కువ ధరకే 4జీ ఫీచర్ ఫోన్‌ను తయారు చేసి అందిస్తామని ఆయన చూచాయగా చెప్పారు. నోకియా నుంచి వచ్చే 4జీ ఫీచర్ ఫోన్లు కచ్చితంగా జనాలను ఆకట్టుకుంటాయని అన్నారు.

అధికారిక ప్రకటన వస్తే..

అయితే దీనిపై అధికారికంగా హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటన చేయలేదు. అధికారిక ప్రకటన వస్తే నోకియా అభిమానులకు ఇది నిజంగా శుభపరిణామమే..

ఇప్పటికే..

ఇప్పటికే రూ.2వేల ధరకే ఎయిర్‌టెల్ 4జీ వీవోఎల్‌టీఈ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అందించేందుకు సిద్ధమవుతుండగా, మైక్రోమ్యాక్స్ భారత్ వన్ పేరిట 4జీ ఫీచర్ ఫోన్‌ను తయారు చేస్తున్నది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia could launch a 4G feature phone in India to counter JioPhone Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot