రూ.6,000లో నోకియా ఫోన్ సంచలనం రేపబోతోందా..?

D1C పేరుతో నోకియా లాంచ్ చేయబోతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో అనేక రూమర్స్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసందే.

|

భారీ అంచనాల మధ్య త్వరలో మార్కెట్లోకి రాబోతున్న నోకియా D1C ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, రెండు ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుందని తాజా రూమర్స్ చెబుతున్నాయి.

రూ.6,000లో నోకియా ఫోన్ సంచలనం రేపబోతోందా..?

Read More : లెనోవో కే6 పవర్ vs షియోమీ రెడ్మీ 3ఎస్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో నోకియా ఎంట్రీని HMD Global ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫబ్రవరిలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో భాగంగా ఈ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

రెండు డిస్‌ప్లే వేరింయట్‌లలో

రెండు డిస్‌ప్లే వేరింయట్‌లలో

నోకియా పవర్ యూజర్ నివేదిక ప్రకారం నోకియా D1C స్మార్ట్‌ఫోన్, రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో లభ్యం కానుందట. అందులో మొదటి వేరియంట్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటే, రెండవ వేరియంట్ 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందట.

రెండు ర్యామ్ వేరియంట్స్..

రెండు ర్యామ్ వేరియంట్స్..

2జీబి ర్యామ్ అలానే 3జీబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్‌లలో 16జీబి, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయాలను కల్పించారట. 1.4GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ పై ఈ ఫోన్‌లు రన్ అవుతాయట.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

16 లేదా 13 మెగా పిక్సల్ కెమెరా..
 

16 లేదా 13 మెగా పిక్సల్ కెమెరా..

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో షిప్ అయ్యే ఈ ఫోన్‌లు 16 మెగా పిక్సల్ లేదా 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మాడ్యుల్స్‌ను కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది.

8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ ముందుగా 8 మెగా పిక్సల్ సెన్సార్‌లను అమర్చే అవకాశముందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

రూ.6,000 నుంచి..

రూ.6,000 నుంచి..

ఇంచుమించుగా ఇలాంటి స్పెసిఫికేషన్‌లతో అందుబాటులో ఉన్న ఫోన్‌‍లు రూ.6,000 నుంచి రూ.9,000 ధరల మధ్య మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

మొదటి లుక్.

మొదటి లుక్.

D1C పేరుతో నోకియా లాంచ్ చేయబోతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో అనేక రూమర్స్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసందే. ఈ ఫోన్‌కు సంబంధించిన మొదటి లుక్ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weiboలో హల్‌చల్ చేస్తుంది.

బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో..

బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో..

నోకియా D1C స్మార్ట్‌ఫోన్ బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో రాబోతున్నట్లు తెులస్తోంది. మెటల్ ఫ్రేమ్ అలానే పాలీ కార్బోనేట్ కలర్ బ్యాక్ ప్యానల్స్‌తో ఈ ఫోన్ కనువిందు చేయనుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Nokia D1C Android Phone Specifications Tipped; Rumoured to Come in 2 Variants. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X