షాకింగ్..13.8 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా డివైస్?

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా పునారగమనం పై యూవత్ ప్రపంచం చర్చించుకుంటోన్న నేపథ్యంలో మరో ఆసక్తికర న్యూస్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

షాకింగ్..13.8 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా డివైస్?

Read More : టార్గెట్ Jio.. వ్యూహాత్మకంగా అడుగులువేస్తోన్న బీఎస్ఎన్ఎల్!

ప్రముఖ బెంచ్‌మార్క్ సైట్ GFX Bench తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం D1C పేరుతో నోకియా డివైస్ 13.8 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉన్న ఆండ్రాయిడ్ టాబ్లెట్ అని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం Geekbench వెబ్‌సైట్ D1C డివైస్ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణిస్తూ తన బెంచ్‌మార్కింగ్ లిస్టింగ్స్‌లో పేర్కొంది.

షాకింగ్..13.8 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా డివైస్?

Read More : ఆ లెనోవో ఫోన్‌కు jio సపోర్ట్ అందింది, పండగ చేస్కోండి

GFX Bench లిస్టింగ్స్ ప్రకారం నోకియా డీ1సీ ఆండ్రాయిడ్ టాబ్లెట్ 13.8 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లేతో రాబోతోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920పిక్సల్స్, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొట్టమొదటి మొబైల్ ఫోన్

ఏప్రిల్ 3, 1973.. మార్టిన్ కూపర్ తన చేతిలోని బరువైన హ్యాండ్ హెల్డ్ డివైస్‌తో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్‌ను చేసారు. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా గుర్తింపు తెచ్చుకున్న అనాటి నుంచి ఈనాటి వరకు మొబైల్ ఫోన్‌ల విభాగంలో అనేక మార్పలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసుకున్న 10 మొబైల్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

నోకియా 5110

నోకియా నుంచి 1990 సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ మొబైల్ ఫోన్ సంస్కృతికి ప్రజలు అలవాటు పడేలా చేసింది. ఫోన్ అప్పర్ కార్నర్ పై చిన్నా యాంటీనాతో దర్శనమిచ్చిన ఈ ఫోన్ 84/48 పిక్సల్ మోనో క్రోమ్ డిస్‌ప్లేతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా 3310

నోకియా 3310, భారత్‌లో చాలా మందికి ఇదే మొదటి ఫోన్. ధృడంగా ఉండే ఈ బల్కీ ఫోన్ గొప్పతనం గురించి ఇప్పటికి మార్కెట్లో చర్చించుకుంటూనే ఉంటారు.

సామ్‌సంగ్ ఫోన్

ఈ ఫ్లిప్ మోడల్ సామ్‌సంగ్ ఫోన్, ఫ్లిప్ అలానే క్లామ్ షెల్ మోడల్ ఫోన్ లకు పునాదిగా నిలిచినపప్పటికి మార్కెట్లో అంతగా నిలవలేకపోయాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్లాక్‌బెర్రీ బోల్డ్

కెనడాకు చెందిన ఈ మొబైల్ ఫోన్‌ల కంపెనీ ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించింది. అయితే కాల క్రమంలో తన ప్రాచుర్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఈ బ్రాండ్ విడుదల చేసిన స్విఫ్ట్ క్వర్టీ కీబోర్డ్ ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ బోల్డ్' ఫోన్ టైపింగ్‌ను మరింత సులభతరం చేసేసింది.

హెచ్‌టీసీ టైటాన్

ఈ స్లైడర్ ఫోన్, పూర్తి సైజు క్వర్టీ కీప్యాడ్ అనే టచ్ స్ర్కీన్ లో విడుదలై యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఈ ఫోన్‌లో ఈమెయిల్ సౌకర్యం కూడా ఉండటం విశేషం. అడ్వాన్సుడ్ టెక్నాలజీతో విడుదలైన తొలి ఫోన్‌లలో హెచ్‌టీసీ టైటాన్ కూడా ఒకటి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా 6610

ఐ కెమెరాతో విడుదలైన ఈ ఫోన్ అప్పట్లో మార్కెట్ హాట్ టాపిక్ అయ్యింది.

నోకియా 1110

2000 సంవత్సరం మధ్యలో విడుదలైన నోకియా 1110 ఫోన్ తక్కువ ధర ట్యాగ్‌తో లక్షలాది మంది యూజర్లను ఆకట్టుకోగలిగింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సోనీ వాక్‌మెన్ డబ్ల్యూ610

సోనీ వాక్‌మెన్ సిరీస్ నుంచి మ్యూజిక్ ప్లేయర్ ప్రత్యేకతతో విడుదలైన ఈ ఫోన్ సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది.

మోటరోలా రాజర్ వీ3

అత్యధికంగా అమ్ముడైన ఫ్లిప్ ఫోన్‌లలో మోటరోలా రాజర్ వీ3 ఒకటి.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యాపిల్ ఐఫోన్

యాపిల్ కంపెనీ నుంచి 2007లో విడుదలైన మొట్టమొదటి ఐఫోన్ మొబైల్ ప్రపంచం రూపురేఖలనే మార్చేసింది. టచ్‌స్ర్కీన్, పెద్ద పెద్ద ఐకాన్‌లు, స్టాండర్డ్ ఫీచర్లు ఈ ఫోన్‌కు చరిత్రపుటల్లో చెక్కుచెదరని స్థానాన్ని కల్పించాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia D1C Is a 13.8-Inch Android Tablet..? Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot