ఇండియానే టార్గెట్, రూ.10,000లోపే నోకియా ఆండ్రాయడ్ ఫోన్‌లు?
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చాలా కీలకంగా భావిస్తోన్న నోకియా..
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో నోకియా అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నోకియా నుంచి రాబోతున్న మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.10,000లోపు ధర ట్యాగ్‌లో లభమయ్యే అవకాశముందని తెలుస్తోంది.
Read More : USSD మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఎలా చేస్తారు..?

నోకియా డీ1సీ రెండు వేరియంట్‌లలో
నోకియా పవర్ యూజర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నోకియా డీ1సీ పేరుతో రాబోతున్న మొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

మొదటి వేరియంట్ వచ్చేసరికి
ఇంచ్ హైడెఫినిషన్ 1080 డిస్‌ప్లే, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి ప్రధానమైన ఫీచర్లు కలిగి ఉంటంది. ఈ ఫోన్ ధర 150 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.10,000).

రెండవ వేరియంట్ వచ్చేసరికి..
5.5 ఇంచ్ హైడెఫినిషన్ 1080 డిస్‌ప్లే, 3జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి ప్రధానమైన ఫీచర్లు కలిగి ఉంటంది. ఈ ఫోన్ ధర 150 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.15,000).
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇతర స్పెసిఫికేషన్స్...
నోకియా డీ1సీ ఫోన్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్(క్లాక్ వేగం 1.4గిగాహెర్ట్జ్), అడ్రినో 505 జీపీయూ, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం.

MWC 2017లో
నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను HMD గ్లోబల్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంది. నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఫిబ్రవరిలో బార్సిలోనా వేదికగా MWC 2017 ఈవెంట్‌లో లాంచ్ చేసే అవకాశముంది.

హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా..
ఇటు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా నోకియా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. రూ.30,000 రేంజ్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లు క్వాడ్ హైడెఫినిషన్ రిసల్యూషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 820 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 22.6 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 4జీ ఎల్టీఈ, ఆండ్రాయిడ్ నౌగట్ ఆవుట్-ఆఫ్-ద-బాక్స్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications