3జీబి ర్యామ్‌తో నోకియా ఫోన్..? రూ.10,000 రేంజ్‌లో..?

మొబైల్ మార్కెట్లో నోకియా పునరాగమనం కోసం యూవత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఇంటర్నెట్‌లో ఆసక్తికర సమాచారం హల్‌చల్ చేస్తోంది.

3జీబి ర్యామ్‌తో నోకియా ఫోన్..? రూ.10,000 రేంజ్‌లో..?

Read More: ఫ్లిప్‌‍కార్ట్ దుమ్ము రేపింది.. ఒక్క రోజులో 8 లక్షలు ఫోన్‌లు సేల్

అప్‌కమింగ్ నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌కు సంబంధించి పముఖ బెంచ్ మార్కింగ్ సైట్ GeekBench కొత్త సమచారాన్ని రివీల్ చేసింది. ఈ సైట్ చెబుతోన్న వివరాల ప్రకారం ఈ ఫోన్ Nokia D1Cగా రాబోతోంది. ఈ ఫోన్ కు సంబంధించి కొన్ని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ను ఈ పాపులర్ వెబ్ సైట్ బహిర్గతం చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం

Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కావటం విశేషం.

ఆక్టా కోర్ ప్రాసెసర్

1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 SoCను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే చిప్‌సెట్‌ను రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లలో వినియోగించారు.

3జీబి ర్యామ్‌తో...

Nokia D1C స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు GeekBench లిస్టింగ్స్ చెబుతున్నాయి.

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే..?

స్నాప్‌డ్రాగన్ 430 SoCతో వచ్చే ఫోన్ ఖచ్చితంగా ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది.

రూ.10,000 రేంజ్‌లో ఉంటుందా..?

నోకియా ఎగ్జిక్యూటివ్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ డిసెంబర్‌లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడుతున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్స్ రూ.10,000 కంటే తక్కువ ధర రేంజ్‌లో అందుబాటులో ఉంటే యూజర్లకు త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia D1C: 5 Things to Know About the Android Nougat Powered Smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot