ఈ రోజుల్లో... ఇలాంటిదొకటుండాలి?

By Prashanth
|
Nokia E5


టెక్నాలజీతో సహవాసం చేస్తున్న రోజులివి. మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ తరహా ఫీచర్లను కలగలుపుతు రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ క్రమేపీ పరిధిని విస్తరించుకుంటుంది. ఈ ప్రభావంతో సాధారణ హ్యాండ్‌సెట్లకు రాను రాను డిమాండ్ తగ్గే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కమ్యూనికేషన్ బంధాలను ధృడపరిచే అత్యుత్తమ శక్తి స్మార్ట్‌ఫోన్‌లలో ఒదిగి ఉంది. ఆ శక్తి ఎంత అంటే ‘ప్రపంచాన్ని తెలుసుకోటానికి సమర్థవంతమైన స్మార్ట్‌ఫోన్ ఒక్కటి చాలు’.........

విశ్వసనీయ బ్రాండ్ నోకియా ఇ5 మోడల్‌లో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. క్వర్టీ ఫోన్‌ల విభాగానికి చెందిన ఈ హ్యాండ్‌సెట్ పటిష్టమైన క్వర్టీ కీప్యాడ్ వ్యవస్థను కలిగి ఉంది. పలు ఉత్తమ ఫీచర్లను స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేశారు. మానవుని కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో ఈ పరికరం పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌ను ఎంపిక చేసుకున్న వారి తమ తమ జీవితాలను అంతరాయం లేని కమ్యూనికేషన్ వ్యవస్థతో మరింత బలపరుచుకోవచ్చు.

స్లీక్ తరహాలో ఆకర్షణీయంగా డిజైన్ కాబడిన ఈ స్మార్డ్ గ్యాడ్జెట్ మన్నికైన శరీరాకృతిని కలిగి ఉంటుంది. ప్రధాన ఫీచర్లు...

. 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే,

. క్వర్టీ కీప్యాడ్,

. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం,

. 5 మెగా పిక్సల్ కెమెరా

. వై-ఫై,

. జీపీఎస్,

. HSDPA,

. జీపీఆర్ఎస్, హై స్పీడ్ ఇంటర్నెట్,

. బ్లూటూత్ కనెక్టువిటీ,

. 2జీబి ఇంటర్నల్ మెమెరీ,

. మైక్రో ఎస్టీ కార్డ్ ద్వారా 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,

. ధర రూ.13,500.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X