lsquo; lsquo; నోకియా విడుదల చేసిన జంట lsquo;ఇ rsquo; సిరీస్ ఫోన్లు lsquo;వాడు - వీడు rsquo; సినిమా రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయమైన బ్రాండ్ గా ముద్ర పడిన నోకియాకు lsquo;ఇ rsquo; సిరీస్ ఫోన్లు lsquo;E6 rsquo;, lsquo;E7 rsquo;లు అత్యుత్తమ అమ్మకాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. rsquo;నోకియా విడుదల చేసిన lsquo;ఇ rsquo; సిరీస్ మొబైల్ ఫోన్లు ప్రపంచ హ్యాండ్ సెట్ల మార్కెట్ ను తమ వైపుకు తిప్పుకున్నాయి. ఈ ఫోన్లలో పొందుపరిచిన డిజైన్, ఫీచర్లు వినియోగదారులను మరింత ఆకట్టకుంటున్నాయి. lsquo;ఇ rsquo; సిరీస్ ఫోన్లైన E6, E7 మోడళ్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.133 గ్రాముల బరువుతో రూపుదిద్దుకున్న lsquo;E6 rsquo; మొబైల్ బార్ విధానం కలిగి ఉండగా, 176 గ్రాముల బరువుతో రూపుదిద్దుకున్న lsquo;E7 rsquo; స్లైఢర్ విధానం కలిగి ఉంటుంది. అయితే ఈ రెండు ఫోన్లలోనూ క్వర్టీ కీబోర్డు విధానాన్ని పొందుపరిచారు. 3జీ వ్యవస్థకు సహకరించే ఈ పరికరాలు జీఎస్ ఎమ్ బ్యాండ్ వ్యవస్థను సపోర్టు చేస్తాయి. 2.46 అంగుళాల డిస్ ప్లే స్క్రీన్ కలిగిన lsquo;నోకియా E6 rsquo;, ఎల్ సీడీ సామర్ధ్యంతో కూడిన టచ్ స్ర్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇక నోకియా lsquo;E7 rsquo;లో 4 అంగుళాల ఆమోల్డ్ సామర్ధ్యం గల టచ్ స్క్రీన్ వ్యవస్థను పొందుపరిచారు. ఎస్ఎమ్ఎస్, ఎమ్ఎమ్ఎస్, ఈ - మెయిల్, పాప్ మెయిల్ వంటి అధునాతన మెసేజింగ్ సౌలభ్యతలను ఈ ఫోన్లలో ప్రవేశపెట్టారు. కెమెరాల విషయానికి వస్తే lsquo;E6 rsquo;, lsquo; E7 rsquo; మొబైల్స్ లో, 8 మెగా పిక్సల్ సామర్థ్యం గల వెనుక కెమెరా, 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యం గల ఫ్రంట్ కెమెరాలను అమర్చారు. ఇక మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే వివిధ ఫార్మాట్లను సపోర్టు చేసే విధంగా మల్టీ ఫార్మాట్ వ్యవస్థను ఈ ఫోన్లలో ప్రవేశపెట్టారు. ఆడియో హార్డ్ వేర్ విషయానికి వస్తే లౌడ్ స్పీకర్, 35 mm ఆడియో అవుట్ పోర్టు వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పొందుపరిచిన ఇంటర్నెట్ ఆప్లికేషన్లు వేగవంతమైన సమాచారాన్ని మీకు అందిస్తాయి. lsquo;E6 rsquo;, lsquo;E7 rsquo;లలో పొందుపరిచిన బ్లూటూత్ V 2.1, v3.0 డివైజ్, యూఎస్బీ v2.0 వ్యవస్థలు ఫైళ్లను వేగవంతంగా ట్రాన్స్ ఫర్ చేస్తాయి. చివరిగా వీటి ధర విషయాన్ని పరిశీలిస్తే నోకియా lsquo;E6 rsquo; రూ.15,490, నోకియా lsquo;E7 rsquo; రూ.24,990 ధరలు కలిగి ఉన్నాయి.