నోకియా నుంచి ఈ ఫోన్ బయటకు వస్తే.. అన్నీ అవుటే !

Written By:

నోకియా నుంచి ఇప్పటికే పలు ఫోన్లు మార్కెట్లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నోకియా నుంచి వచ్చిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో ఓ ట్రెండ్ సెట్ చేశాయి కూడా. ఇక త్వరలో రానున్న నోకియా 7, నోకియా 8, నోకియా 9 డివైస్ ల మీద అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి.

రూ. 20 వేల ఫోన్ రూ. 10,999కే..

నోకియా అభిమానులు అవి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు కూడా. అయితే నోకియా నుంచి మరో సంచలనపు ఫోన్ రాబోతుందని పలు వార్తలు వస్తున్నాయి. నోకియా ఎడ్జ్ ప్రో బీస్ట్ పేరిట ఈ మొబైల్ రాబోతుందని పలు వెబ్‌సైట్లలో రూమర్లు వస్తున్నాయి.

జియో ఫోన్లతో బిజినెస్..ఆర్డర్ ఇస్తే చాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

42 ఎంపీ కెమెరాతో

నోకియా నుంచి రానున్న ఈ ఫోన్ కి ప్రధాన ఆకర్షణగా కెమెరా నిలవబోతుందట. దాదాపు 42 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

డిస్ ప్లే

6.0 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో నోకియా ఫోన్ రానుందట. దీని రిజల్యూషన్ విషయానికొస్తే 3840×2160 pixels.

ఎడ్జ్ టూ ఎడ్జ్ డిజైన్

ఎడ్జ్ టూ ఎడ్జ్ డిజైన్ తో రానున్న ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 చిప్ సెట్, అలాగే డెకా కోర్ 2.5GHz ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్

మెమొరీ విషయానికొస్తే ఈ ఫోన్ 6జిబి ,8జిబి ర్యామ్ లతో రానుందని సమాచారం. ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ విషయానికొస్తే 128 /256 జిబి.

కెమెరా

కెమెరా విషయానికొస్తే Carl Zeiss optics lensతో 42 ఎంపీ ప్యూర్ వ్యూ మెయిన్ షూటర్ గా ఆఫర్ చేస్తోంది. అలాగే 20 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అదిరిపోయే స్నాప్ షాట్ లు తీసుకోవచ్చు.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 5000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ. క్విక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్. అయితే దీనిపై నోకియా నుంచి ఎటువంటి సమాచారం లేదు. కేవలం రూమర్లు మాత్రమే.

ధర

ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే దీని ధర సుమారుగా రూ. 58,199గా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

నోకియా నుంచి పూర్తి సమాచారం

దీనిపై నోకియా నుంచి పూర్తి సమాచారం వస్తే గాని స్పష్టత రాదు. మరి నోకియా ఎప్పుడు స్పష్టత నిస్తుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Edge Pro beast: 8GB RAM 42 MP pure View Camera Revealed Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot