ఫ్యాన్స్ అత్యుత్సాహం!

Posted By: Super

ఫ్యాన్స్ అత్యుత్సాహం!

 

ఆపిల్ ఐఫోన్5ను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ వెలువరించిన పత్రికా ప్రకటన టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా చర్చించుకుంటున్న నేపధ్యంలో మరో ఉదంతం చోటుచేసుకుంది. సామ్‌సంగ్ తరహాలో నోకియా సైతం ఐఫోన్5ను టార్గెట్ చేస్తూ కరపత్రం తరహాలో ఓ పేపర్ యాడ్‌ను విడుదల చేసింది. అయితే, ఈ చర్యకు పాల్పడింది నోకియా అభిమానులని తేలిపోయింది.  "Flyweight vs the heavyweight" అనే నినాదంతో  ఈ ప్రకటన రూపుదిద్దుకుంది. ఈ ప్రకటనలో ప్రధానంగా ఐఫోన్5, నోకియా లూమియా 920 స్మార్ట్‌ఫోన్‌ల మధ్యగల ఫీచర్లను విశ్లేషించారు.

నోకియా లూమియా 920:

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

ఐఫోన్ 5:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot