Home
Mobile

నోకియా 6 ఎలా ఉంది..?

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి జనవరి 19న జరిగిన మొదటి ఫ్లాష్‌సేల్‌లో భాగంగా కేవలం 60 సెకన్ల వ్యవధిలో 100,000 మంది యూజర్లు ఈ ఫోన్‌లను బుక్ చేసుకున్నట్లు సమాచారం.

By Sivanjaneyulu Bommu

చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత నోకియా నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ Nokia 6 చైనా మార్కెట్లో ఫ్లాష్ సేల్ పై విక్రయించబడుతోన్న విషయం తెలిసిందే.

నోకియా 6 ఎలా ఉంది..?

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఆఫర్ ఇస్తున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

JD.com ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న ఈ ఫోన్ విడుదలకు ముందు భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడిన ఈ ఫోన్ 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

 బెంచ్ మార్క్ స్కోర్‌ విడుదల చేసిన Geekbench

బెంచ్ మార్క్ స్కోర్‌ విడుదల చేసిన Geekbench

నోకియా అభిమానుల భారీ అంచనాల మధ్య మార్కెట్లో అయిన నోకియా 6 బెంచ్ మార్క్ స్కోర్‌ను Geekbench విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం నోకియా 6 44,517 పాయింట్లను స్కోర్ చేయగలిగింది.

యాపిల్ ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3టీ

యాపిల్ ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3టీ

ఇదే సమయంలో యాపిల్ ఐఫోన్ 7 స్కోర్ 190,000 పాయింట్లుగాను, వన్‌ప్లస్ 3టీ స్కోర్ 160,000 పాయింట్లుగాను ఉంది.

నోకియా 6 హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు

నోకియా 6 హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు

ముందుగా పేర్కొన్నట్లుగానే నోకియా 6, హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు. ఇదో మిడ్ రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. మరి ఇలాంటి ఫోన్ ను ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3టీలతో పోల్చి చూడటం అంతగా కరెక్ట్ కాదు.

Geekbench వెల్లడించిన  స్కోర్ ప్రకారం

Geekbench వెల్లడించిన స్కోర్ ప్రకారం

Geekbench వెల్లడించిన స్కోర్ ప్రకారం చూస్తే, నోకియా 6 ఫోన్‌లో హై-ఎండ్ గేమ్స్ అలానే యాప్స్‌ను రన్ చేయటం కొద్దిగా కష్టమే. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే..? నోకియా 6 ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. 

అనధికారికంగా తెలియవచ్చిన సమచారం ప్రకారం..

అనధికారికంగా తెలియవచ్చిన సమచారం ప్రకారం..

బార్సిలోనా వేదికగా ఫిబ్రవరిలో జరగబోతున్నమొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017ను పురస్కరించుకుని HMD Global ఓ హై-ఎండ్ నోకియా స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు తెలియవచ్చింది.

60 సెకన్లలో లక్ష నోకియా 6 ఫోన్‌లు

60 సెకన్లలో లక్ష నోకియా 6 ఫోన్‌లు

తాజాగా అందుతోన్న రిపోర్ట్స్ ప్రకారం నోకియా 6 స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి జనవరి 19న జరిగిన మొదటి ఫ్లాష్ సేల్ లో భాగంగా కేవలం 60 సెకన్ల వ్యవధిలో 100,000 మంది యూజర్లు ప్రీఆర్డర్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన రెండవ
ఫ్లాష్ సేల్ జనవరి 25న జరుగుతుది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Nokia Fans! The Benchmark Scores Of Nokia 6 Is Going To Surprise You. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X