బడ్జెట్ ఫోన్స్‌పై ఆసక్తి చూపుతున్న నోకియా

Posted By: Staff

బడ్జెట్ ఫోన్స్‌పై ఆసక్తి చూపుతున్న నోకియా

ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ఏది అంటే ఠక్కున చెప్పే సమాధానం మొబైల్ మార్కెట్. సాధారణంగా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్ ఎప్పటికీ మార్కెట్లో హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతుంటాయి. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం జిపిఆర్‌ఎస్, ఎడ్జి టెక్నాలజీ, కెమెరా, కనెక్టివిటీ ఫీచర్స్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ స్టయిలిష్‌గా ఉండే మొబైల్స్‌పై జనాభా ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలిసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని నోకియా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్స్‌ని మార్కెట్లోకి తీసుకొవాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగానే నోకియా ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెంబర్ వన్ షిప్‌ని అలానే నిలబెట్టుకొవాలంటే మార్కెట్లో కాంపిటేషన్‌ని తట్టుకొవడానికి ఇంటర్నెట్ ఫెసిలిటీస్‌తో ఉన్నమొబైల్స్‌ని తక్కువ ధరలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 3000 మంది వాలంటీర్స్‌కి సర్వే పెడితే 82శాతం మంది యూత్ రూ 6000 ఖరీదు లోపు ఉన్న మొబైల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిని పెట్టడమే కాకుండా ఇంటర్నెట్, ఈమెయిల్స్, ఛాటింగ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలిసింది.

భారతదేశం మొత్తం 47మిలియన్ల జనాభా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని సమాచారం. అందులో 11.8 మిలియన్ మంది జనాభా మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్న తరుణంలో నోకియా రూ 6000 ఖరీదు కలిగిన మొబైల్స్‌లలో ఇంటర్నెట్ ఫీచర్స్‌ని అందించే మొబైల్స్‌ని తయారు చేయడానికి సిద్దమైంది. సాధారణంగా నోకియా కంపెనీ యూజర్స్ ఆసక్తికి అనుగుణంగా మొబైల్స్‌ని రూపోందిస్తందన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో జాస్మిత్ గాంధీ(హెడ్ ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్) నోకియా, ఇండియా మాట్లాడుతూ నోకియా ముందుగానే యూజర్స్‌కు చెప్పినట్లుగా త్వరలో అత్యాధునిక ఫీచర్స్ కలిగిన హ్యాండ్ సెట్స్‌ని తక్కువ ధరకే మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot