నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ విడుదల.. ధర, సేల్ వివరాలు
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ (Nokia G42 5G Smartphone) గత సంవత్సరం అక్టోబర్‌లో భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. అయితే తాజాగా నోకియా సంస్థ ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్రే, పర్పల్, పింక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ కొత్త ఫోన్ ధర, సేల్ వివరాలు :
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ (Nokia G42 5G New Variant) 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ సేల్ మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. HMD.com మరియు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ద్వారా కొనుగోలు చేయవచ్చు.

నోకియా G42 5G స్పెసిఫికేషన్లు :
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్ సహా ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలా డిస్‌ప్లే్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ పొందుతుంది.
ఈ నోకియా స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 480+ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది 4GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. మరియు అదనంగా 2GB ర్యామ్ వరకు వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు. మరియు 128GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు పొడిగించుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ సమయంలోనూ ఎంతో అనువుగా ఉంటుందని సంస్థ చెబుతోంది.

20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 5000mAh బ్యాటరీ :
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. 2 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నోకియా సంస్థ తెలిపింది. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా :
ఫోటోగ్రఫీ పరంగా ఈ నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. హైరిజల్యూషన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 8MP కెమెరాను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా ఈ నోకియా హ్యాండ్‌సెట్ డ్యూయల్ సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాట్ రెసిస్టెన్స్‌తో వచ్చింది. నోకియా G42 5G 4GB ర్యామ్ వేరియంట్ సేల్ మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. హెచ్‌ఎండీ సహా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








