Home
Mobile

ధర రూ.9,799 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, సేల్‌ పూర్తి వివరాలు..!

నోకియా G42 5G స్మార్ట్‌ ఫోన్‌ (Nokia G42 5G Smartphone) ఇండియాలో గత సంవత్సరం లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక ప్యానల్‌ రీసైకిల్‌ చేయబడిన ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ప్రస్తుతం ఈ నోకియా స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ లో ఏకంగా 25 శాతం తగ్గింపు ధరను పొందింది. ఎటువంటి బ్యాంకు ఆఫర్‌లతో సంబంధం లేకుండా ఈ ధరకు స్మార్ట్‌ఫోన్‌ ను సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం అమెజాన్‌లో నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ +128GB స్టోరేజీను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.9,799 కే హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరకే ఈ నోకియా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Nokia G42 5G Smartphone attracts with massive discount

నోకియా G42 5G స్పెసిఫికేషన్లు :
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1612 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 560 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 రక్షణను పొందుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 480+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. అదనంగా 2GB ర్యామ్ వరకు వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు. 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.

ఈ నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. ఈ నోకియా హ్యాండ్‌సెట్‌ 20W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4GB ర్యా్మ్‌ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రే, పర్పుల్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఈ నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. హై రిజల్యూషన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాట్‌ రెసిస్టెన్స్‌తో వచ్చింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia G42 5G Smartphone 6GB Ram Variant received massive discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X