ధర రూ.11,699 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో నోకియా 5G స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు..!
నోకియా G42 స్మార్ట్ ఫోన్ (Nokia G42 5G Price Drop) గత సంవత్సరం భారత్ మార్కెట్ లో విడుదల అయింది. ఈ హ్యాండ్ సెట్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా... తాజాగా 6GB ర్యామ్ వేరియంట్ ధరను తగ్గించింది. ఈ స్మార్ట్ ఫోన్ మెరుగైన డిజైన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ వెనుక ప్యానల్ ను రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ తో తయారు చేశారు.
నోకియా G42 స్మార్ట్ ఫోన్ ధర తగ్గింపు.. :
నోకియా G42 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ గత నవంబర్‌లో రూ.12,599 కి లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్ సెట్ ధర రూ.900 తగ్గింది. ఫలితంగా రూ.11,699 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ గ్రే, పర్పల్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

నోకియా G42 5G స్పెసిఫికేషన్లు :
నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 90Hz రీఫ్రెష్ రేట్ సహా ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలా డిస్‌ప్లే్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ పొందుతుంది.
ఈ నోకియా స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 480+ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది 4GB ర్యామ్ తో జతచేయబడుతుంది. అదనంగా 2GB ర్యామ్ వరకు వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు. 128GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు పొడిగించుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ సమయంలోనూ ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.

20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 5000mAh బ్యాటరీ :
నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. 2 సంవత్సరాలపాటు OS అప్ డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్ డేట్లను అందిస్తామని సంస్థ తెలిపింది. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
హై రిజల్యూషన్ 50MP ప్రైమరీ కెమెరా :
ఫోటోగ్రఫీ పరంగా ఈ నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. హై రిజల్యూషన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాట్ రెసిస్టెన్స్‌తో వచ్చింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








