నోకియా ఇండియా ఎండీ పీ.బాలాజీ రాజీనామా

నోకియా ఇండియా ఎండీ (మైక్రోసాఫ్ట్ డివైసెస్ గ్రూప్) పీ.బాలాజీ తన పదవికి రాజీనామా చేసారు. బాలాజీ తన వ్యక్తిగత కారణాల రిత్యా పదవికి రాజీనామా చేసినట్లు మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే నోకియా హ్యాండ్‌సెట్ డివిజన్‌ను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
జూలై 2012లో బాలాజీ నోకియాలో చేరారు. బాలాజీ, నోకియా ఇండియా ఎండీ పదవికి రాజీనామా చేసినప్పటికి అక్టోబర్ 2014 వరకు మైక్రోసాఫ్ట్ డివైసెస్ గ్రూప్‌కు సలహాదారుగా కొనసాగనున్నారు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఒకప్పుడు నెం.1 స్థానాన్ని సొంతం చేసుకున్న నోకియా క్రమంగా ఆ ఖ్యాతిని కొల్పోతూ వస్తోంది. ముఖ్యంగా సామ్‌సంగ్, మైక్రోమాక్స్ వంటి బ్రాండ్‌లు మార్కెట్లో నోకియాకు గట్టిపోటీగా నిలుస్తున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








