నోకియా కొత్త టెక్నాలజీ రాకతో మిగిలిన వాటిల్లో టెన్షన్

Posted By: Super

నోకియా కొత్త టెక్నాలజీ రాకతో మిగిలిన వాటిల్లో టెన్షన్

మొబైల్ రంగంలో రారాజుగా వెలిగొందిన నోకియా ఏది చేసినా అందులో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అందుకే కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా ఓ సరిక్రొత్త టెక్నాలజీని పరిచయం చేస్తుంది. ఏంటా ఆ సరిక్రొత్త టెక్నాలజీ అని అనుకుంటున్నారా.. అదేనండీ ఈరోజుల్లో ఎక్కువగా మనం వింటున్న పదం ఎన్‌ఎఫ్‌సి(Near Field Communication). చాలా మందికి ఈ ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీ గురించి తెలియదు. అసలు ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాం. ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీతో రూపోందించినటువంటి చిప్స్‌ని రెండు మొబైల్స్‌లలో ఇనిస్టాల్ చేసి ఒకే ఒక సింగిల్ టచ్‌లో డేటాని ట్రాన్పర్ చేస్తారు. ఎన్‌ఎఫ్‌సి ఛిప్‌ని ఇనిస్టాల్ చేసిన మొబైల్ ఒక స్మార్ట్ ఫోన్‌తో సమానం.

ప్రస్తుతం మొబైల్ ఇండస్ట్రీలో ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీని ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్‌లలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లైతే ఈ ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీని హై ఎండ్ మొబైల్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీని మొబైల్ తయారీదారు కంపెనీలు ఎక్కువ డబ్బులు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీతో వచ్చేటటువంటి మొబైల్స్‌ని అత్యధిక ధరకు వినియోగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీ గురించి నోకియా విసృతంగా సమాచారం అందిస్తుంది. అందులో భాగంగానే ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీకి సంబంధించిన పోస్టర్స్, స్టిక్కర్స్, టాగ్స్ మొదలగున వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీని నోకియా కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా రూపోందించడమే కాకుండా ఉపయోగపడే విధంగా ఈ టెక్నాలజీని రూపోందించడం జరుగుతుంది. ఇందుకోసం నోకియా ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ హబ్‌ని ప్రవేశపెట్టింది. దానిపేరే నోకియా ఎన్‌ఎఫ్‌సి హబ్. కస్టమర్స్ ఈ ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటే నోకియా ఎన్‌ఎఫ్‌సి హబ్‌ లోకి వెళ్లి దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీకి రాబోయే కాలంలో మంచి గుర్తింపు వస్తుందని తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot