కొత్త స్ర్కీప్ట్ రెడీ!

By Prashanth
|
Nokia


ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ నోకియా తన లూమియా, ప్యూర్ వ్యూ సిరీస్‌ల నుంచి కొత్త రేంజ్‌‌లో స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ చర్యల్లో భాగంగా ‘సూపర్ హైడ్రోఫోబిక్’ టెక్నాలజీని ఈ సిరికొత్త హ్యాండ్‌‍సెట్‌లలో నిక్షిప్తం చేసేందుకు కసరత్తులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది.

 

సూపర్ హైడ్రోఫోబిక్ టెక్నాలజీ అంటే ఏంటి..?

 

ఈ సరికొత్త వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీ నీరు అదే విధంగా చమ్మవాతావరణం నుంచి స్మార్ట్‌ఫోన్‌ను సంరక్షిస్తుంది. ఈ టెక్నాలజీతో తయారుకాబడిన లూమియా, ప్యూర్ వ్యూ హ్యాండ్‌సెట్‌లను వర్షంలో సైతం వినియోగించుకోవచ్చు. ఈ సూపర్ హైడ్రోఫోబిక్ టెక్నాలజీ ఫోన్‌లలోకి చక్క నీరు ప్రవేశించకుండా జాగ్రత్తవహిస్తుందని నోకియా పశ్చిమ యూరోప్ ఉపాధ్యక్షుడు కోనార్ పియర్స్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తొలిగా లూమియా 610 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్డడించారు.

నోకియా లూమియా 610:

ప్రఖ్యాత మొబైల్ ఫోన్‌లు తయారీ సంస్థ నోకియా (Nokia) ఇండియాలో ప్రవేశపెట్టబోతున్న స్మార్ట్‌ఫోన్ లూమియా 610కి సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. విండోస్ ఫోన్ 7.5 ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

ప్రధాన ఫీచర్లు:

3.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, విండోస్ ఫోన్ 7.5 ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ సింగిల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, హై క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ 2.0, ఇంటర్నల్ మెమరీ 8జీబి, ఎక్సటర్నల్ మెమెరీ 16జీబి, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), బ్యాటరీ స్టాండ్ బై 580 గంటలు, ధర రూ.12,000. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అదనపు అప్లికేషన్‌లు ఫోటో ఎడిటర్, ప్రిడిక్టివ్ టెక్స్ట్ ఇన్‌పుట్, వాయిస్ మెమో, క్యాలెండర్, పీసీ సింక్రనైజేషన్ వంటి అంశాలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఫోన్‌లో పొందుపరిచిన హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రౌజర్ ద్వారా వినియోగదారుడు వివిధ గేమింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేుసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X