నోకియా మరో అద్బుత సృష్టే 'నోకియా కైనటిక్ డివైజ్'

Posted By: Super

నోకియా మరో అద్బుత సృష్టే 'నోకియా కైనటిక్ డివైజ్'

నోకియా మొబైల్ కంపెనీ ఇటీవల నోకియా వరల్డ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ షోలో నోకియా రాబోయే కాలంలో విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్స్, నోకియా ఆశా సిరిస్ మొదలగున వాటిని ప్రదర్శించింది. వీటితో పాటు నోకియా కొత్తగా విడుదల చేయనున్న 'నోకియా కైనటిక్' డివైజ్‌కి సంబంధించి ప్రొటొటైపుని విడుదల చేసింది. నోకియా కైనటిక్ డివైజ్‌ని చూసిన అభిమానులు సంభ్రమాశ్చర్యాలలో మునిగి తెలిపోయారు.

నోకియా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కైనటిక్ డివైజ్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకొదగ్గ ఫీచర్ 'ప్లెక్సిబులిటీ'. ఈ ఫీచర్‌తో మొబైల్‌ని ఎలా కావాలంటే అలా వంచుకొవచ్చు. మరొ ఫీచర్ వాటర్ ఫ్రూఫ్. యూజర్స్‌కు మెనుని సెలక్ట్ చేసుకునే విధంగా దీని వంగే తత్వాన్ని రూపొందించడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎటుకావాలంటే అటు బెండ్ అయ్యేందుకు గాను ఇందులో కార్బన్ నానో టూబ్స్‌ని, ఎలాస్టోమీటర్ మీడియాన్ని ఇమడింపజేయడం జరిగింది. ఈ మొబైల్‌లో ఉన్న మరో అద్బుతమైన ఫీచర్ యూజర్స్ నడచేటప్పుడు డివైజ్‌ని చూడకుండానే ఈ మెయిల్స్‌ని యాక్సెస్ చేసుకొవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot