నోకియా నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర రూ.15000 వేల లోపే!
నోకియా కంపెనీ గ్లోబల్ మార్కెట్లలో 3 కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. నోకియా బ్రాండెడ్ మొబైల్స్ తయారీకి లైసెన్స్ కలిగి ఉన్న హెచ్‌ఎండీ గ్లోబల్ రూ.15,000 బడ్జెట్‌తో నోకియా జీ22, నోకియా సీ32, నోకియా సీ22 అనే 3 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది.ఇప్పుడు వీటి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
నోకియా నుండి వచ్చిన ఈ 3 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విభిన్న విషయాలు/ఫీచర్‌లపై దృష్టి సారించాయి. అంటే నోకియా జి22 ఫోన్‌ను సులభంగా రిపేర్ చేసేలా రూపొందించబడింది మరియు నోకియా సి32 మంచి సి-సిరీస్ కెమెరా ఫోన్‌గా రూపొందించబడింది. ఇక నోకియా C22 - దృఢమైన, మన్నికైన స్మార్ట్‌ఫోన్‌గా నిర్మించబడింది. అయితే, ఈ 3 మోడళ్లకు ఒక ఉమ్మడి విషయం ఉంది. నోకియా ప్రకారం, ఈ 3 ఫోన్‌లు ఒకే ఛార్జ్‌పై 3 రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయి!

నోకియా G22 ధర,ఫీచర్ల వివరాలు
నోకియా G22 స్మార్ట్‌ఫోన్ 4GB + 64GB మరియు 4GB + 128GB అనే 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి వేరియంట్ ఇండియన్ మార్కెట్లో సుమారు రూ. 15,700 కు లాంచ్ అయింది. ఇది మెటోర్ గ్రే మరియు లగూన్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది.ఇక ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ఫోన్, యూనిసోక్ D606 ప్రాసెసర్ తో గరిష్టంగా 6GB RAM మరియు 128GB నిల్వతో 4G RAM వేరియంట్ తో కూడా వస్తుంది.ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో 6.5 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP ప్రధాన కెమెరా + 2MP డెప్త్ కెమెరా + 2MP మాక్రో కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5050mAh ఛార్జింగ్ సపోర్ట్ తో 20W బ్యాటరీ మరియి ఆండ్రాయిడ్ 12 OS తో వస్తుంది.
నోకియా C22 ధర,ఫీచర్ల వివరాలు
నోకియా C22 స్మార్ట్‌ఫోన్ 2GB + 64GB మరియు 3GB + 64GB అనే 2 స్టోరేజ్ ఆప్షన్‌ల క్రింద విడుదల చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాథమిక వేరియంట్ ధర ఇండియన్ మార్కెట్లో ధర రూ.11,310 కి లాంచ్ అయింది. ఇది మిడ్‌నైట్ బ్లాక్ మరియు సాండ్ అనే 2 కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది.ఇక ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.
ఈ ఫోన్ IP2 స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ తో టఫ్ 2.5D డిస్ప్లే గ్లాస్ - పాలికార్బోనేట్ యూనిబాడీ, సాలిడ్ మెటల్ ఛాసిస్ బిల్ట్ క్వాలిటీ తో వస్తుంది. ఇది 6.5 అంగుళాల HD+ డిస్ప్లే, యూనిసోక్ 9863A1 ప్రాసెసర్ తో 3GB వరకు RAM మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఇంకా,13MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా - 5000mAh బాటరీ 10W ఛార్జింగ్ ఆప్షన్ తో వస్తుంది. ఇది 4G LTE నెట్వర్క్ పై పనిచేస్తుంది. ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) తో పనిచేస్తుంది.
నోకియా C32 ధర మరియు ఫీచర్లు
నోకియా C32 స్మార్ట్‌ఫోన్ 3GB + 64GB మరియు 4GB + 64GB అనే 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో ప్రారంభించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాథమిక వేరియంట్ ధర భారత మార్కెట్లో సుమారు రూ.12,190 గా ఉంటుంది. ఇది చార్‌కోల్, ఆటమ్ గ్రీన్ మరియు పీచ్ పింక్ అనే 3 కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది.
ఇక ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల వివరాలు గమనిస్తే, 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరా తో 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. 4GB RAM వరకు ఆప్షన్ ఉంది. మిగిలిన ఫీచర్లు పైన పేర్కొన్న నోకియా C22 ఫీచర్లను పోలి ఉంటాయి.


Click it and Unblock the Notifications