నోకియా అభిమానులకు ‘మెగా న్యూస్’

Posted By: Super

 నోకియా అభిమానులకు ‘మెగా న్యూస్’

నమ్మకమైన బ్రాండ్ నోకియా గత జూన్‌లో మూడు ఆషా టచ్ సిరీస్ ఫోన్‌లను ప్రకటించింది. వాటిలో మొదటిదైన ‘ఆషా305’ను నోకియా తాజాగా ఆవిష్కరించింది. వినోదాత్మక అంశాలతో నిండి ఉన్న డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్‌లో 40 ప్రీలోడెడ్ గేమ్‌లతో పాటు మీడియా ఫైళ్లను స్టోర్ చేసుకునేందుకు 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ సపోర్ట్‌ను కల్పించారు.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 240 x 400పిక్సల్స్,

2మెగాపిక్సల్ రేర్ కెమెరా,

10ఎంబీ ఇన్-బుల్ట్ మెమెరీ,

మైక్రో ఎస్‌డి కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 14గంటలు, స్టాండ్‌బై టైమ్ 528గంటలు),

విండోస్ లైవ్ మెసెంజర్, యాహూ మెసెంజర్, గుగూల్ టాక్.

నోకియా ఆన్‌లైన్ షాప్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌కు రూ.4,668 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot